క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో | Reliance Jio Justifies Extension of Free Calls, Data Offer to TRAI | Sakshi
Sakshi News home page

క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో

Published Fri, Dec 30 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో

క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో

న్యూఢిల్లీ: బిలియనీర్ ముఖేష్ అంబానీ జియో ఆఫర్లపై  వివరణ ఇచ్చారు. అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో  తాజా ఫ్రీ వాయిస్ డేటా ఆఫర్  లో ఎలాంటిని నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని   చెప్పింది.   ప్రమోషనల్  ఆఫర్  90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను ఉల్లఘించలేదని స్పష్టం చేసింది.  ప్రారంభ ఆఫర్, తమ తాజా హ్యాపీ న్యూ ఇయర్ రెండూ వేరు వేరని పేర్కొంది. జియో ఉచిత ఆఫర్ ను  2017 మార్చి వరకు పొడిగించడంపై ఇతర టెలికం కంపెనీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై  టెలికాం రెగ్యులేటరీ  ట్రాయ్  వివరణ కోరడంతో జియో  ఇలా సమాధానం ఇచ్చింది.  తమ ఆఫర్ కొనసాగుతుందని పేర్కొంది.


డిసెంబర్ 20న ట్రాయ్ రాసిన లేఖపై స్పందించిన  జియో  ప్రమోషనల్ ఆఫర్ కు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ భిన్నమైందని పేర్కొంది.   ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన  'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను  దోపిడీగా  లెక్కించడం తగదని తన  వివరణాత్మక సమాధానంలో ట్రాయ్  కు వివరించింది.

 కాగా సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 4 తో  ముగిసిన  90 రోజుల  ప్రమోషనల్ ఆఫర్  ముగిసింది. అయితే  హ్యాపీ న్యూ ఇయర్  ఆఫర్   పేరుతో  మార్చి 31, 2017వరకు పొడిగించింది.  దీన్ని తీవ్రంగా విభేదించిన  ప్రధాన టెలికం కంపెనీలు  ట్రాయ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement