న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాము చౌక టారిఫ్‌లను అమలు చేస్తున్నామన్న దుగ్ధతోనే ఎయిర్‌టెల్ జియోఫైబర్‌పై ఫిర్యాదులు చేస్తోందని, కావాలనే తమ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలు చేస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు ఆరోపణలు మళ్లీ చేయకుండా ఎయిర్‌టెల్‌ను హెచ్చరించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో కోరింది.
రిజిస్టర్ చేసుకోని డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలకు కంటెంట్‌ను అందించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు డౌన్‌లింకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రాయ్‌కు ఎయిర్‌టెల్ ఫిర్యాదు చేసింది. తద్వారా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను జియో టీవీ ప్రసారం చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జేఐఎల్) బ్రాడ్‌బ్యాండ్ ప్లానలతో పాటు పోటీ సంస్థలను దెబ్బతీసేలా చౌకగా లైవ్ టీవీ చానెళ్లు కూడా అందిస్తోందంటూ ఎయిర్‌టెల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జియోకు ట్రాయ్ సూచించింది. తాము వినియోగదారులకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామనే అక్కసుతోనే ఎయిర్‌టెల్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో స్పష్టం చేసింది. తమ ప్లాన్లపై వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment