10 Bed ICU
-
తెలంగాణ పప్పు రేవంత్..ఇండియా పప్పు రాహుల్: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీర్ మండిపడ్డారు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అయితే ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్, రేవంత్ ఎగేసుకొనిపోయి కాళేశ్వరం చూసి వచ్చారన్నారు. బ్రిడ్జి ఎక్స్పాన్షన్ లెవల్‌ను చూపిస్తూ కూలిపోతుందని ఫొటోలు పెడుతున్న వీళ్లు మహా ఇంజనీర్లని ఎద్దేవా చేశారు. ఇదీ.. వీళ్ళ అవగాహన అని చమత్కరించారు. రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరమైతే.. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని, తెలుసుకునే సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మానకొండూరులో సాగునీరు లేక ఎస్సారెస్పీ కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్లమని గుర్తుచేశారు. స్క్రిప్ట్ అయినా మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్‌ను అన్నా మార్చుకో అని రాహుల్‌కు సూచించారు కేటీఆర్. జల యజ్ఞాన్ని ధన యజ్ఞం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో మీ అమ్మ,నువ్వు ఇద్దరూ అవినీతి చేసింది వాస్తవం కాదా? అని రాహుల్‌ను కేటీఆర్ ప్రశ్నించారు -
అందరూ మహానటి అని అనుకుంటారు కానీ మహా నాటు
-
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. ►దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. ►దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటుచేసింది. ►మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. ►3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు. ►జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులకు అందించింది. ►దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్‌ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. ►తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌టీవీల ఏర్పాటు చేయనుంది. ►దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. ►విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ►పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. ► పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియాకు చెందిన షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? -
పోటీ సంస్థలను దెబ్బతీస్తున్న జియో.. ఎయిర్టెల్ ఏం చెబుతోందంటే?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాము చౌక టారిఫ్‌లను అమలు చేస్తున్నామన్న దుగ్ధతోనే ఎయిర్టెల్ జియోఫైబర్‌పై ఫిర్యాదులు చేస్తోందని, కావాలనే తమ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలు చేస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు ఆరోపణలు మళ్లీ చేయకుండా ఎయిర్‌టెల్‌ను హెచ్చరించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో కోరింది. రిజిస్టర్ చేసుకోని డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలకు కంటెంట్‌ను అందించడం ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు డౌన్‌లింకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ ట్రాయ్‌కు ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. తద్వారా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను జియో టీవీ ప్రసారం చేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్జేఐఎల్) బ్రాడ్‌బ్యాండ్ ప్లానలతో పాటు పోటీ సంస్థలను దెబ్బతీసేలా చౌకగా లైవ్ టీవీ చానెళ్లు కూడా అందిస్తోందంటూ ఎయిర్టెల్ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జియోకు ట్రాయ్ సూచించింది. తాము వినియోగదారులకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామనే అక్కసుతోనే ఎయిర్టెల్ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని జియో స్పష్టం చేసింది. తమ ప్లాన్లపై వివరణ ఇచ్చింది.