తెలంగాణ పప్పు రేవంత్‌..ఇండియా పప్పు రాహుల్‌: కేటీఆర్‌  | KTR Says Revanth Reddy Is Dangerous than Dawood Ibrahim | Sakshi
Sakshi News home page

దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ రేవంత్: కేటీఆర్‌ 

Published Thu, Nov 2 2023 8:46 PM | Last Updated on Thu, Nov 2 2023 9:02 PM

KTR Says Revanth Reddy Is Dangerous than Dawood Ibrahim - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీర్‌ మండిపడ్డారు.  తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అయితే ఇండియా పప్పు రాహుల్‌ గాంధీ అని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాహుల్‌, రేవంత్‌ ఎగేసుకొనిపోయి కాళేశ్వరం చూసి వచ్చారన్నారు. బ్రిడ్జి ఎక్స్పాన్షన్‌ లెవల్‌ను చూపిస్తూ  కూలిపోతుందని ఫొటోలు పెడుతున్న వీళ్లు మహా ఇంజనీర్లని ఎద్దేవా చేశారు. ఇదీ..  వీళ్ళ అవగాహన అని చమత్కరించారు.  

రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరమైతే.. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్‌​ పార్టీ అని కేటీఆర్‌ విమర్శించారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని, తెలుసుకునే సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మానకొండూరులో సాగునీరు లేక ఎస్సారెస్పీ కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్లమని గుర్తుచేశారు. స్క్రిప్ట్ అయినా మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్‌ను అన్నా మార్చుకో అని రాహుల్‌కు సూచించారు కేటీఆర్. జల యజ్ఞాన్ని ధన యజ్ఞం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని మండిపడ్డారు. 

దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ రేవంత్ రెడ్డి అని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో మీ అమ్మ,నువ్వు ఇద్దరూ అవినీతి చేసింది వాస్తవం కాదా? అని రాహుల్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement