జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ | Jio : NOW ENJOY 1GB PER DAY AT ONLY RS 149 MONTHLY | Sakshi
Sakshi News home page

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌

Published Fri, Jan 5 2018 8:24 PM | Last Updated on Sat, Jan 6 2018 2:50 PM

Jio : NOW ENJOY 1GB PER DAY AT ONLY RS 149 MONTHLY   - Sakshi

టెలికాం మార్కెట్‌ సంచలనం జియో న్యూఇయర్‌ సందర్భంగా కొత్త ప్లాన్లను అందుబాటులో తీసుకొచ్చింది.  ప్రత్యర్థి ఆపరేటర్లకు  దడ పుట్టిస్తూ  సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని ఆఫర్లపై అదనపు డేటా ప్రయోజలను అందివ్వనుంది. 2018  సంవత్సరంలో జియో వినియోగదారులకు అధిక డేటా, అపురూపమైన  ప్రయోజనాలను అందివ్వనునున్నామని తెలిపింది. అధిక డేటా వినియోగానికి మద్దతు ఇవ్వడానికి, జియో ప్రత్యేకంగా రోజుకి 1.5జీబీ డేటా ప్లాన్‌ను కూడా పరిచయం చేస్తోంది. అంతేకాదు నూతన సంవత్సరంలో తాము ఇవ్వబోతున్న ఆఫర్లలో ఇది మొదటిదని  మున్ముందు మరిన్ని ఆఫర్లతో కస్టమర్లకు  మరిన్ని డేటా  ఆ ఫర్లను అందించనుందట. మంగళవారం, జనవరి 9, 2018 నుండి వినియోగదారులకు అందుబాటులో  ఉంటాయని తెలిపింది.

రూ. 149 ప్యాక్‌పై రోజుకు 1 జీబీ డేటా అందిస్తోంది. ఇది మంత్లీ ప్లాన్‌. దీంతోపాటు ఇపుడున్న 1 జీబీ ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను అందివ్వనున్నట్టు శుక్రవారం జియో జ్రకటించింది.  1 జీబీ  డేటా అందిస్తున్న అన్ని  పధకాలపై  2 అదనపు  ప్రయోజనాల ఎంపిక.  50శాతం ఎక్కువ డేటా  లేదా  ప్లాన్ విలువలో రూ.50   డిస్కౌంట్‌ అందివ్వనుంది.  అలాగే  రూ. 369ల ప్లాన్‌లో 20శాతం అదనపు డేటాతో , వాలిడిటీనీ కూడా రెండు వారాలను అదనంగా పెంచింది. అంటే 70రోజుల వాలిడిటీ ఈ ప్లాన్‌  84రోజులపాలు చెల్లుబాటవుతుంది. రోజుకు1.5 జీబీ డేటా ప్లాన్‌నుకూడా ప్రకటించింది. రూ.4 లకే ఒక జీబీ అందిస్తోంది.  అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్, మొబైల్ యాప్స్, సినిమాలు లభించనున్నాయి. ఈ అన్ని ప్రణాళికలు జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే లభిస్తాయి.  

రూ. 50 తగ్గింపు ప్లాన్‌: ప్రయోజనాలు
రూ. 349 ప్యాక్ (రూ. 399 ) 70 రోజుల వాలిడిటీ, 70జీబీడేటా
రూ.399 ప్యాక్ (రూ 459 )84 రోజుల చెల్లుబాటు84జీబీ డేటా
రూ. 449 ప్లాన్ (రూ 499 )91 రోజుల చెల్లుబాటు 91 జీబీ డేటా

50శాతం అదనపు డేటాప్లాన్లు

రూ. 198 ప్యాక్: 28 రోజుల చెల్లుబాటు, 42జీబీ డేటా
రూ. 398 ప్యాక్: 70 రోజుల చెల్లుబాటు, 105 జీబీ డేటా
రూ. 448 ప్యాక్: 84 రోజుల చెల్లుబాటు,126జీబీ డేటా
రూ.498 ప్యాక్‌: 91 రోజుల చెల్లుబాటు, 136జీబీ డేటా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement