Jio New Year Offers 2022 Recharge: జియో యూజర్లకు న్యూయర్‌ గిఫ్ట్‌..! - Sakshi
Sakshi News home page

Jio Happy New Year Offer: జియో యూజర్లకు న్యూయర్‌ గిఫ్ట్‌..! 

Published Sat, Dec 25 2021 9:22 PM | Last Updated on Sun, Dec 26 2021 10:09 AM

Jio Announced Happy New Year Offer On Rs 2545 Prepaid Recharge Plan - Sakshi

Jio Happy New Year Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన యూజర్లకు న్యూయర్‌ గిఫ్ట్‌ను అందించింది. రూ. 2545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై హ్యపీ న్యూయర్‌ ఆఫర్‌ను యూజర్లకు జియో ప్రకటించింది. సాధారణంగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545 యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. హ్యాపీ న్యూయర్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చును.  దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ప్లాన్‌ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది. 


 

రూ. 2545 ప్లాన్‌ మరిన్ని వివరాలు..!
జియో రూ. 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 సందేశాలు, రోజువారీ ప్రాతిపదికన 1.5GB హై-స్పీడ్ డేటా రానుంది. దాంతో పాటుగా జియో టీవీ. జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ సేవలను పొందవచ్చును. 

చదవండి:  ఈ ఏడాదిలో ఎగబడి సందర్శించిన వెబ్‌సైట్‌ ఇదే..! గూగుల్‌ మాత్రం కాదండోయ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement