offer period
-
జియో యూజర్లకు న్యూయర్ గిఫ్ట్..!
Jio Happy New Year Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన యూజర్లకు న్యూయర్ గిఫ్ట్‌ను అందించింది. రూ. 2545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై హ్యపీ న్యూయర్ ఆఫర్‌ను యూజర్లకు జియో ప్రకటించింది. సాధారణంగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545 యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. హ్యాపీ న్యూయర్ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చును. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ప్లాన్ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది. రూ. 2545 ప్లాన్ మరిన్ని వివరాలు..! జియో రూ. 2,545 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 సందేశాలు, రోజువారీ ప్రాతిపదికన 1.5GB హై-స్పీడ్ డేటా రానుంది. దాంతో పాటుగా జియో టీవీ. జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను పొందవచ్చును. చదవండి: ఈ ఏడాదిలో ఎగబడి సందర్శించిన వెబ్సైట్ ఇదే..! గూగుల్ మాత్రం కాదండోయ్..! -
ఆఫర్ పెంచనున్న జియో?
ముంబై: ఆరు నెలల పాటు ఉచిత కాల్స్, డేటా సేవలు అందిస్తూ వస్తున్న రిలయన్స్ జియో తన ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడిగించనుందా? తాజాగా వస్తున్న వార్తలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. అయితే మూడు నెలల పాటు పెంచే ఉచిత సేవలను వినియోగించుకోవడానికి చిన్నమొత్తంలో రుసుము విధించాలని జియో యోచనలో ఉన్నట్లు తెలిసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొదట వెల్కమ్ ఆఫర్ పేరిట మూడు నెలల పాటు ఉచిత సేవలను అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'హ్యాపీ న్యూఇయర్ ఆఫర్' పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు దాన్ని పొడిగించింది. ఇటీవలే 7.2 కోట్ల వినియోగదారుల మైలురాయిని అందుకున్న జియో తమ ఖాతాదారులను మరింత ఆకట్టుకునే దిశగా సాగుతోంది. తక్కువ మొత్తంలో రీచార్జ్ ద్వారా డేటాతో పాటు ఉచిత కాల్స్‌ను అందించాలనే ఆలోచనలో ఉంది. కేవలం రూ.100కే అందించే ఈ ఆఫర్ ను ఈ ఏడాది జూన్ వరకూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆఫర్ సమయం ముగిసేలోగా కాల్‌డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని జియో భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జియో దెబ్బకు మిగిలిన టెలికం సంస్థలు డేటా ఛార్జీలను భారీగా తగ్గించాయి. కొన్ని ప్రత్యేక ప్యాక్‌ల ద్వారా ఉచిత కాల్స్ సదుపాయాన్నీ ఆయా కంపెనీలు అందిస్తున్నాయి.