వన్ ప్లస్ ఫోన్లకు బైబ్యాక్ ఆఫర్
చైనీస్ స్మార్ట్ పోన్ కంపెనీ వన్ ప్లస్, తన పాత ఫోన్ల ఎక్సేంజ్ కు బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రీగ్లోబ్ తో కలిసి వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం వన్ ప్లస్ ఫోన్లు అంటే వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ ఎక్స్ లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పాత ఫోన్ ఎక్సేంజ్ పై వినియోగదారులు రూ.16 వేల వరకూ తగ్గింపు పొందవచ్చని పేర్కొంది.
ఈ బైబ్యాక్ స్కీమ్ కేవలం అమెజాన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ ఫోన్ల కంపెనీ చెప్పింది. 64జీబీ ఉన్న వన్ ప్లస్ టూ అమెజాన్ లో రూ.22,999కు లభ్యమవుతుండగా.. వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ ఎక్స్ లు రూ.19,999లకు, రూ. 14,999లకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మొదట వినియోగదారులు కొనుకోవాలనుకున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఎంచుకుని, ఆర్డర్ ప్లేస్ చేసి, ఆర్డర్ ఐడీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అమెజాన్ లో ఫర్ చేస్డ్ మొబైల్ పేజీకి వెళ్లి, మొబైల్ పేబ్యాక్ స్కీమ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నియమ నిబంధనలను ఒప్పుకున్న తర్వాత రీగ్లోబ్ పేజీకి వినియోగదారుల వివరాలను మళ్లించబడతారు.
వినియోగదారులు ప్రస్తుతం ఉన్న స్మార్ట్ పోన్ వివరాలను ఆ రీగ్లోబల్ పేజీలో నమోదు చేయాల్సి ఉంటుంది. దానితో పాటు కొనుకుంటున్న వన్ ప్లస్ పోన్ ఆర్డర్ ఐడీని కూడా తెలపాలి. ఈ వివరాలన్నీ నమోదుచేసిన తర్వాత కొత్త ఫోన్ ధర, బైబ్యాక్ ఆఫర్, ఏ స్టోర్ లో వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందో ఆ పేజీలో కనిపిస్తాయి. ఆ పేజీలోనే వినియోగదారులు కాంటాక్టు వివరాలు ఇస్తే, రీగ్లోబల్ పేజీ నుంచి వినియోగదారులకు కాల్ వస్తుంది. కొత్తగా కొన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, క్యాష్ బ్యాక్ ను రీగ్లోబల్ పేజీ వారు నిర్దేశించిన సమయానికి వినియోగదారులకు చేరవేస్తారు.