
Oneplus 9 Pro, Oneplus 9. Oneplus Nord CE 5G Discounts Up To 13000: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్సుతో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తే రూ. 8000 తక్షణ తగ్గింపు రానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్ రానుంది. వీటితో పాటుగా కొనుగోలుదారులకు రూ. 5000 అమెజాన్ కూపన్‌ను కూడా అందిస్తోంది. ఈ కూపన్ వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై రానుంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లభించనున్నాయి.
వన్‌ప్లస్ 9 ప్రో డీల్
వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 10 వేల తగ్గింపు రానుంది.
వన్‌ప్లస్ 9 డీల్
వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 8,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది.అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 13 వేల తగ్గింపు రానుంది
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5G డీల్
బడ్జెట్ ఫ్రెండ్లీ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీపై అమెజాన్ రూ. 1,500 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై మూడు నెలల నో-కాస్ట్ సౌకర్యం ఉంది.
చదవండి: The Best Smartphones Of 2021: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Comments
Please login to add a commentAdd a comment