OnePlus smartphones
-
OnePlus: వన్‌ప్లస్ విక్రయాలు నిలిపేస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్‌ప్లస్ ..!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకెళ్లింది. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్ల(1 కోటి) మొబైల్స్ విక్రయించింది. తాము అనుకున్న లక్ష్యం కంటే ముందే ఈ మార్క్ చేరుకున్నట్లు పీట్ లావ్ తెలిపారు. వన్‌ప్లస్ కంపెనీ 8వ వార్షికోత్సవం సందర్భంగా వీబోలో రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు. వన్‌ప్లస్ 9 సిరీస్ లాంఛ్ అయిన 10 సెకండ్లలోనే 40 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాగాయని తెలిపారు. అందుబాటు ధరలో వన్‌ప్లస్ 9ఆర్, 9ఆర్టీ స్మార్ట్ఫోన్లను కూడా ఈ ఏడాది వన్‌ప్లస్ లాంఛ్ చేయడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. 2021 ప్రధమార్ధంలో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్స్ 257 శాతం వృద్ధి నమోదు చేశాయి. అమెరికాకు షిప్ మెంట్లు సంవత్సరానికి 428% పెరిగాయి. 2021 ఐరోపాలో వన్‌ప్లస్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో అత్యధిక వృద్ది రేటు సాధించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్ అమ్మకాలు ఏకంగా 304 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక భారత్‌లో 29 శాతం వార్షిక వృద్ధి సాధించగా, ఈ ఏడాది మూడో క్వార్టర్లో రూ. 30,000పైబడిన స్మార్ట్ఫోన్ల విక్రయంలో 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు వన్‌ప్లస్ వెల్లడించింది. అలాగే, వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరం సభ్యులు 11 మిలియన్లకు చేరుకుంది. వన్‌ప్లస్ సంస్థ కొత్త ఏడాదిలో 10 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. ఈ మొబైల్స్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నాయి. (చదవండి: 120 కిమీ రేంజ్‌తో మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) -
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై రూ. 13 వేల వరకు భారీ తగ్గింపు..!
Oneplus 9 Pro, Oneplus 9. Oneplus Nord CE 5G Discounts Up To 13000: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డ్సుతో వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తే రూ. 8000 తక్షణ తగ్గింపు రానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్ రానుంది. వీటితో పాటుగా కొనుగోలుదారులకు రూ. 5000 అమెజాన్ కూపన్‌ను కూడా అందిస్తోంది. ఈ కూపన్ వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై రానుంది. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కూడా లభించనున్నాయి. వన్‌ప్లస్ 9 ప్రో డీల్ వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 10 వేల తగ్గింపు రానుంది. వన్‌ప్లస్ 9 డీల్ వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై రూ. 8,000 తక్షణ తగ్గింపు అమెజాన్ అందిస్తోంది.అంతేకాకుండా తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. అమెజాన్ అందిస్తోన్న కూపన్ కోడ్ రూ. 5,000తో మొత్తంగా రూ. 13 వేల తగ్గింపు రానుంది వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5G డీల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీపై అమెజాన్ రూ. 1,500 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై మూడు నెలల నో-కాస్ట్ సౌకర్యం ఉంది. చదవండి: The Best Smartphones Of 2021: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! -
అతి ప్రమాదకరమైన స్మార్ట్ఫోన్లు ఇవేనట!
సెల్‌ఫోన్ మనిషి జీవితంలో భాగమై పోయింది. ఒక నిత్యావసర వస్తువుగా అవతరించిన క్రమంలో చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఇక సోషల్ మీడియాకు బానిసలైపోతున్న ప్రస్తుత తరుణంలో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్ఫోన్లతోనే కాలక్షేపం.అయితే స్మార్ట్‌ఫోన్ వల్ల సాంకేతికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. వీటినుంచి వెలువడే రేడియేషన్‌తో ఆరోగ్యానికి ముప్పు కూడా అంతకంటే ఎక్కువే పొంచి వుంది. ఇది జగమెరిగిన సత్యం అయినా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. షావోమి, వన్ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్ఫోన్లు అతి ప్రమాదకరమైనవిగా పేర్కొంది. ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్ 16జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి, వన్‌ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. షావోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐఏ1, వన్‌ప్లస్ 5టీ స్మార్ట్ఫోన్లు ఈ వరుసలో ముందున్నాయి. షావోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్7 నిలిచింది. దీంతోపాటు యాపిల్ ఐ ఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల రేడియేషన్ కూడా అత్యధికంగానే నమోదైందని రిపోర్టు చేసింది. మరోవైపు అతి తక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ డివైస్‌లు నిలవడం గమనార్హం. ఎల్జీ, హెచ్‌టీసీ, మోటో, హువావే, హానర్కుచెందిన కొన్నిఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని నివేదించింది. ఇతర చైనా కంపెనీలు ఒప్పో, వివో తయారు చేసిన స్మార్ట్ఫోన్లను పరీక్షించలేదని పేర్కొంది. -
వన్ ప్లస్ ఫోన్లకు బైబ్యాక్ ఆఫర్
చైనీస్ స్మార్ట్ పోన్ కంపెనీ వన్ ప్లస్, తన పాత ఫోన్ల ఎక్సేంజ్ కు బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రీగ్లోబ్ తో కలిసి వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం వన్ ప్లస్ ఫోన్లు అంటే వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ ఎక్స్ లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పాత ఫోన్ ఎక్సేంజ్ పై వినియోగదారులు రూ.16 వేల వరకూ తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. ఈ బైబ్యాక్ స్కీమ్ కేవలం అమెజాన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ ఫోన్ల కంపెనీ చెప్పింది. 64జీబీ ఉన్న వన్ ప్లస్ టూ అమెజాన్ లో రూ.22,999కు లభ్యమవుతుండగా.. వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ ఎక్స్ లు రూ.19,999లకు, రూ. 14,999లకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మొదట వినియోగదారులు కొనుకోవాలనుకున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఎంచుకుని, ఆర్డర్ ప్లేస్ చేసి, ఆర్డర్ ఐడీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అమెజాన్ లో ఫర్ చేస్డ్ మొబైల్ పేజీకి వెళ్లి, మొబైల్ పేబ్యాక్ స్కీమ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నియమ నిబంధనలను ఒప్పుకున్న తర్వాత రీగ్లోబ్ పేజీకి వినియోగదారుల వివరాలను మళ్లించబడతారు. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న స్మార్ట్ పోన్ వివరాలను ఆ రీగ్లోబల్ పేజీలో నమోదు చేయాల్సి ఉంటుంది. దానితో పాటు కొనుకుంటున్న వన్ ప్లస్ పోన్ ఆర్డర్ ఐడీని కూడా తెలపాలి. ఈ వివరాలన్నీ నమోదుచేసిన తర్వాత కొత్త ఫోన్ ధర, బైబ్యాక్ ఆఫర్, ఏ స్టోర్ లో వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందో ఆ పేజీలో కనిపిస్తాయి. ఆ పేజీలోనే వినియోగదారులు కాంటాక్టు వివరాలు ఇస్తే, రీగ్లోబల్ పేజీ నుంచి వినియోగదారులకు కాల్ వస్తుంది. కొత్తగా కొన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, క్యాష్ బ్యాక్ ను రీగ్లోబల్ పేజీ వారు నిర్దేశించిన సమయానికి వినియోగదారులకు చేరవేస్తారు.