చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకెళ్లింది. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్ల(1 కోటి) మొబైల్స్ విక్రయించింది. తాము అనుకున్న లక్ష్యం కంటే ముందే ఈ మార్క్ చేరుకున్నట్లు పీట్ లావ్ తెలిపారు. వన్‌ప్లస్ కంపెనీ 8వ వార్షికోత్సవం సందర్భంగా వీబోలో రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు.
వన్‌ప్లస్ 9 సిరీస్ లాంఛ్ అయిన 10 సెకండ్లలోనే 40 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాగాయని తెలిపారు. అందుబాటు ధరలో వన్‌ప్లస్ 9ఆర్, 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్లను కూడా ఈ ఏడాది వన్‌ప్లస్ లాంఛ్ చేయడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. 2021 ప్రధమార్ధంలో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్స్ 257 శాతం వృద్ధి నమోదు చేశాయి. అమెరికాకు షిప్ మెంట్లు సంవత్సరానికి 428% పెరిగాయి. 2021 ఐరోపాలో వన్‌ప్లస్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో అత్యధిక వృద్ది రేటు సాధించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్ అమ్మకాలు ఏకంగా 304 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక భారత్‌లో 29 శాతం వార్షిక వృద్ధి సాధించగా, ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో రూ. 30,000పైబడిన స్మార్ట్‌ఫోన్ల విక్రయంలో 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు వన్‌ప్లస్ వెల్లడించింది. అలాగే, వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరం సభ్యులు 11 మిలియన్లకు చేరుకుంది. వన్‌ప్లస్ సంస్థ కొత్త ఏడాదిలో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. ఈ మొబైల్స్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నాయి.
(చదవండి: 120 కిమీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment