Global Sales
-
గత నెలలో పుంజుకున్న గ్లోబల్ సేల్స్!
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వృద్ధి, ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు ఏప్రిల్‌లో పుంజుకున్నాయి. నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. ఇందుకు సంబంధించిన పీఎంఐ సూచీ (ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) మార్చిలో 56.4 పాయింట్లు ఉండగా ఏప్రిల్‌లో 57.2 పాయింట్లకు పెరిగింది. సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థపరమైన పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటివి కూడా ఇందుకు దోహదపడినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోల్యానా డి లిమా తెలిపారు. దీనికి సంబంధించిన సర్వే ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి వృద్ధి రేటు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగిందని, తగ్గిపోయే నిల్వలను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు కూడా మరింతగా ముడి సరుకులను కొనుగోలు చేస్తున్నాయని లిమా వివరించారు. భారతీయ తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్లడానికి పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని లిమా పేర్కొన్నారు. మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డిమాండ్ మెరుగ్గా ఉండటం వంటి అంశాలు కొత్త ఆర్డర్లకు దోహదపడుతున్నాయని చెప్పారు. -
ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై!
సాక్షి, ముంబై: జాన్సన్ & జాన్సన్ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. పలు వివాదాల నేపథ్యంలో ఇకపై జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలకు స్వస్తి పలకే ఆలోచనలో ఉంది. వివిధ దేశాల్లో చట్టపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని యోచిస్తోంది. (ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా) కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ 2023 నాటికి టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ ప్రపంచవ్యాప్తంగా విక్రయాలను నిలిపివేయనున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. ఈమేరకు హెల్త్‌కేర్ దిగ్గజం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఉత్పత్తి విక్రయాలను ముగించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్త పోర్ట్‌ఫోలియో మదింపులో భాగంగా, కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విక్రయిస్తున్నామని పేర్కొంది. అమెరికా, కెనడాలలో బేబీ పౌడర్ అమ్మకాలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. జాన్సన్ టాల్కం పౌడర్‌పై వినియోగదారులకు తప్పుడు సమాచారం అందించిందనీ, ప్రమాదకరమైన, కలుషిత పదార్థాలు ఉన్నాయని పలుపరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో యూరప్‌లో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. 1894 నుండి జాన్సన్ బేబీ పౌడర్ ఐకానిక్ సింబల్‌గా మారింది. అయితే ఆ తరువాతికాలంలో జాన్సన్ పౌడర్ వల్లనే కేన్సర్‌కు గురైమయ్యామని, బాధితులు, చనిపోయిన వారి బంధువులు కోర్టుకెక్కారు. అలాగే టాల్క్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్ కేన్సర్ కారకం ఉందని దశాబ్దాలుగా కంపెనీకి తెలుసని 2018 రాయిటర్స్ పరిశోధన వాదించింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ తమ ఉత్పత్తులు సురక్షితమైనవనీ, అస్బెస్టాస్-రహితమైనవని ఇప్పటికీ వాదిస్తోంది. పలు వినియోగ దారులు, ప్రాణాలతో బయటపడినవారు, బంధువులకు చెందిన సుమారు 38వేల వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పలుకోర్టులు కస్టమర్లకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. 22 మంది మహిళలకు 2 బిలియన్ల డాలర్లకుపైగానే పరిహారం అందించింది కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ అమ్మకాలను నిలిపి వేయాలని కోరుతూ చాలా మంది కోర్టులో దావా వేశారు. ఈ క్రమంలో టాల్కం పౌడర్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలనే చూస్తోంది. -
ఐదేళ్లలో తొలిసారిగా..! మెర్సిడెజ్ బెంజ్ స్థానం ఆ కంపెనీ కైవసం..!
2021గాను ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్‌కు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదిలో వాహనాల విక్రయాల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెజ్ బెంజ్‌కు ఉన్న క్రేజ్‌ను 2021గాను బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. గత ఏడాదిగాను లగ్జరీ కార్ల కేటాగిరీలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా బీఎండబ్ల్యూ నిలిచింది. తగ్గిన అమ్మకాలు..! ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడైన ప్రీమియం లగ్జరీ కార్లలో బెంజ్ మొదటిస్థానాన్ని కోల్పోయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలను మెర్సిడెజ్ బెంజ్ విక్రయించినట్లు తెలుస్తోంది. అదే ఏడాదిగాను సుమారు రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ వాహనాల అమ్మకాలను బీఎండబ్ల్యూ జరిపింది. ప్రీమియం కార్లలో మెర్సిడెజ్-బెంజ్ స్థానాన్ని బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. మరోవైపు అనూహ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో మెర్సిడెజ్ బెంజ్ 90 శాతం మేర అధికంగా అమ్మకాలను జరపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బెంజ్ సుమారు 99,301 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. యూరప్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మెర్సిడెజ్ బెంజ్ ఈ ఏడాదిగాను అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఇది దాదాపు 11.2 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో విక్రయాల్లో అతి తక్కువ వృద్ధిని మెర్సిడెస్-బెంజ్ సాధించింది. 2021గాను అమెరికాలో 0.4 శాతం పెరుగుదలను నమోదుచేసింది. బీఎండబ్ల్యూ అమ్మకాల్లో భారత్‌లో భేష్..! 2021 భారత్‌లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. చదవండి: రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 235 కి.మీ..! -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దుమ్ములేపిన వన్‌ప్లస్ ..!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకెళ్లింది. వన్‌ప్లస్ సీఈఓ పీట్ లావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్ల(1 కోటి) మొబైల్స్ విక్రయించింది. తాము అనుకున్న లక్ష్యం కంటే ముందే ఈ మార్క్ చేరుకున్నట్లు పీట్ లావ్ తెలిపారు. వన్‌ప్లస్ కంపెనీ 8వ వార్షికోత్సవం సందర్భంగా వీబోలో రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు. వన్‌ప్లస్ 9 సిరీస్ లాంఛ్ అయిన 10 సెకండ్లలోనే 40 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాగాయని తెలిపారు. అందుబాటు ధరలో వన్‌ప్లస్ 9ఆర్, 9ఆర్టీ స్మార్ట్ఫోన్లను కూడా ఈ ఏడాది వన్‌ప్లస్ లాంఛ్ చేయడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. 2021 ప్రధమార్ధంలో వన్‌ప్లస్ గ్లోబల్ షిప్‌మెంట్స్ 257 శాతం వృద్ధి నమోదు చేశాయి. అమెరికాకు షిప్ మెంట్లు సంవత్సరానికి 428% పెరిగాయి. 2021 ఐరోపాలో వన్‌ప్లస్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో అత్యధిక వృద్ది రేటు సాధించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్ అమ్మకాలు ఏకంగా 304 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక భారత్‌లో 29 శాతం వార్షిక వృద్ధి సాధించగా, ఈ ఏడాది మూడో క్వార్టర్లో రూ. 30,000పైబడిన స్మార్ట్ఫోన్ల విక్రయంలో 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు వన్‌ప్లస్ వెల్లడించింది. అలాగే, వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరం సభ్యులు 11 మిలియన్లకు చేరుకుంది. వన్‌ప్లస్ సంస్థ కొత్త ఏడాదిలో 10 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. ఈ మొబైల్స్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నాయి. (చదవండి: 120 కిమీ రేంజ్‌తో మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) -
3 నెలల్లోనే 30 లక్షల విక్రయాలు
అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్ 10’ స్మార్ట్‌ఫోన్‌ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్‌గా లాంచ్ చేసిన తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. లాంచ్ చేసిన 3 నెలల వ్యవధిలోనే 30 లక్షల విక్రయాల మైలురాయిని తాకి, హానర్ 10 దూసుకుపోయింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో వెల్లడించింది. ‘30 లక్షల హానర్ 10 విక్రయాలు, 30 లక్షల మందికి కృతజ్ఞతలు. హానర్ 10కు సపోర్టు ఇచ్చిన హానర్ అభిమానులందరికీ అభినందనలు. మీ సాయం లేకుండా.. ఈ మైలురాయిని తాకడం సాధ్యమయ్యేది కాదు’ అని కంపెనీ ట్వీట్ చేసింది. లాంచ్ చేసిన నెలలోనే 1 మిలియన్ పైగా యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే సగటున నెలకు 10 లక్షల యూనిట్లు విక్రయాలను నమోదు చేసింది. ఆన్లైన్ రిటైలర్ షాపీలో కూడా హానర్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌గా నిలిచింది. రష్యా, ఫ్రాన్స్‌ల్లో కూడా ఈ స్మార్ట్ఫోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. తొలుత హానర్ 10 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. అక్కడ లాంచ్ చేసిన రెండు నెలల అనంతరం గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్ సెట్ ఖరీదు చైనాలో 2,599 సీఎన్వైగా, భారత్‌లో రూ.32,999గా ఉంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. హానర్ 10 స్పెసిఫికేషన్లు 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ నాచ్ డిస్ప్లే (ఐఫోన్ టెన్ మాదిరి) హువాయి కిరిన్ 970 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 24ఎంపీ + 16ఎంపీ డ్యుయల్ వెనుక కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఈఎంయూఐ 8.1 ఇంటర్ఫేస్ -
టాప్ గేర్ లో టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్
ముంబై: ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ సెప్టెంబర్ గ్లోబల్ హోల్ సేల్ అమ్మకాల్లో టాప్ గేర్ లో దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష యూనిట్లకు పైగా వాహనాలను విక్రయించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాలతో కలిపి మొత్త వాహనాల 5.35 శాతం వృద్ధితో 1,02,289 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,102 యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో గ్లోబల్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 7.2 వృద్ధిని సాధించింది. గత ఏడాది 63,334 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది 67,895 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది. లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 51,074 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 3.6 శాతం వృద్ధిని సాధించింది. 52,914 వాహనాలను విక్రయించింది. వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 1.85 శాతం వృద్ధితో 33.768 యూనిట్లకు విక్రయించింది. గత ఏడాది ఇవి 34, 394 యూనిట్లుగా ఉన్నాయి.