
సాక్షి, ముంబై: టెక్ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ శుక్రవారం భారీగా నష్టపోయింది. బ్లాక్‌డీల్స్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో హెక్సావేర్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లో 19 శాతం వరకు పతనమైంది. రూ.401 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని దాదాపు 13 శాతం నష్టంతో రూ. 433 వద్ద ట్రేడవుతోంది. అయితే పలు బ్లాక్‌డీల్స్ ద్వారా మొత్తం ఈక్వీటీలో13.5 శాతం 40.06 మిలియన్ల షేర్లు చేతులు మారినట్టు ఎక్స్చేంజ్ గణాంకాలు ద్వారా తెలుస్తోంది.
కంపెనీ ప్రమోటర్ బేరింగ్ ప్రయివేట్ ఈక్విటీ ఆసియా సంస్థ బ్లాక్‌డీల్స్ ద్వారా 8.4శాతం వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీ ఈ లావాదేవీలను నిర్వహించినట్లు తెలియజేశాయి. రూ. 447.5 ఫ్లోర్ ప్రైస్ ప్రకారం బేరింగ్ పీఈకి వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1100 కోట్లు లభించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించి ఉండవచ‍్చని అంచనా. కాగా జూన్ 30, 2018 నాటికి, హెక్సావేర్ టెక్నాలజీస్‌లో పీరింగ్ ఆసియా గ్లోబల్ ఐటి సొల్యూషన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ద్వారా 71.22శాతం వాటాను కలిగి ఉంది. హెక్సావేర్ టెక్నాలజీస్ మార్కెట్ గత ఏడాదితో పోల్చుకుంటే 81 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment