ఫలితాలు, గణాంకాలు కీలకం | Expert predictions on the trend of the markets this week | Sakshi
Sakshi News home page

ఫలితాలు, గణాంకాలు కీలకం

Published Mon, Oct 14 2024 6:27 AM | Last Updated on Mon, Oct 14 2024 8:06 AM

Expert predictions on the trend of the markets this week

భౌగోళిక, రాజకీయ అంశాలకూ ప్రాధాన్యం 

చమురు ధరలు, రూపాయి కదలికల ఎఫెక్ట్‌ 

విప్రో బోనస్, హ్యుందాయ్‌ ఐపీవోపై దృష్టి 

ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు 

దేశీ స్టాక్‌ మార్కెట్లను ఈ వారం పలు కీలక అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ గత వారమే ప్రారంభమైంది. ఇకపై ఊపందుకోనుంది. వారాంతాన ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పీఎస్‌యూ ఇరెడా, జస్ట్‌డయల్‌ జులై–సెప్టెంబర్‌(క్యూ2) ఫలితాలను వెల్లడించాయి. ఈ బాటలో మరిన్ని దిగ్గజాలు క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి.  

క్యూ2 జాబితాలో 
ఈ వారం ప్రయివేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, బ్యాంకింగ్‌ బ్లూచిప్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల ట్రెండ్‌ను ఫలితాలు నిర్దేశించే వీలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 17న ఐటీ సేవల దిగ్గజం విప్రో క్యూ2 ఫలితాలుసహా బోనస్‌ షేర్లను ప్రకటించనుంది. అంతేకాకుండా 12న డీమార్ట్‌ క్యూ2 పనితీరును వెల్లడించడంతో సోమవారం(14న) ఈ ప్రభావం రెండు షేర్లపై కనిపించే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు.  

3 ఐపీవోలు 
ఈ వారం మూడు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ప్రధానమైనది హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇష్యూ. అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనున్న రూ. 27,870 కోట్ల ఇష్యూ మంగళవారం ప్రారంభమై గురువారం ముగియనుంది. ఈ బాటలో మరో రెండు చిన్న కంపెనీలు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఐపీవోకు రానున్నాయి. లక్ష్య పవర్‌టెక్, ఫ్రెషార ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్‌ 16–17 మధ్య ఇష్యూలు చేపట్టనున్నాయి. అయితే గత వారం క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఎస్‌ఎంఈ ఐపీవో తదుపరి ట్రాఫిక్‌సోల్‌ను లిస్ట్‌కాకుండా నిలిపి వేయడం గమనార్హం. నిధుల వినియోగంపై అభియోగాలతో మరింత లోతైన దర్యాప్తునకు సైతం ఆదేశించింది.  

ద్రవ్యోల్బణం 
గత వారం పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడగా.. ఇకపై రిటైల్‌ ధరలు(సీపీఐ), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌ నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం నేడు(సోమవారం) విడుదల చేయనుంది. వీటికితోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు సెంటిమెంటును దెబ్బతీయగలవని స్టాక్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇండియా, చైనా, యూకే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖేమ్కా వెల్లడించారు. ఈసీబీ పాలసీ రేట్ల నిర్ణయాలు, చైనా జీడీపీ, యూఎస్‌ రిటైల్‌ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నట్లు వివరించారు. వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని తెలియజేశారు.

చమురు రయ్‌ 
ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నీ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చైనా సహాయక ప్యాకేజీలు, అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. మరోపక్క 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ మెరుగుపడటం సైతం విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.

ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు 
కొద్ది రోజులుగా అమ్మకాల యూటర్న్‌ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల మరిన్ని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల(అక్టోబర్‌)లో ఇప్పటివరకూ(1–11 మధ్య) నికరంగా రూ. 58,711 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే గత నెల(సెపె్టంబర్‌)లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. గత 9 నెలల్లో ఇవి అత్యధిక పెట్టుబడులుకాగా.. ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, చైనా సహాయక ప్యాకేజీల తదుపరి దేశీ స్టాక్స్‌లో నిరంతర అమ్మకాలు చేపడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేలండర్‌ ఏడాది ఏప్రిల్, మే నెలల తదుపరి జూన్‌ నుంచి ఎఫ్‌పీఐలు దేశీయంగా పెట్టుబడులకే కట్టుబడినట్లు మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అయితే పశ్చిమాసియా యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు పెరగడం, చైనా మార్కెట్లు బలపడుతుండటం వంటి అంశాలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేíÙంచారు. వెంచురా సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినిత్‌ బి. సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గత వారమిలా 
గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 307 పాయింట్లు క్షీణించి 81,381 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు నీరసించి 24,964 వద్ద స్థిరపడింది.

–సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement