వేసవి కాలం ఆరంభంలో ఉండగానే చల్లదనం కోసం హైదరాబాదీలు సెర్చింగ్ మొదలెట్టారు. ఎయిర్ కండీషన్ కోసం తెగ వాకాబు చేస్తున్నారు. జస్ట్ డయల్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఏసీ విషయంలో హైదరాబాద్ నగరం ముంబై, ఢిల్లీలతో పోటీ పడుతోంది.
సెర్చింగ్ సైట్ గూగుల్‌లో జస్ట్ డయల్‌ది ప్రత్యేక స్థానం. ఏదైనా సర్వీస్‌కి సంబంధించిన సమాచారం ఇక్కడ ఠక్కున లభిస్తుంది. అందుకే నెటిజన్లు జస్ట్ డయల్‌ని రెగ్యులర్‌గా క్లిక్ చేస్తుంటారు. వేసవి ఆరంభం నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా రివీల్ చేసిన డేటాలో ఏసీలు కోసం సెర్చింగ్ బాగా పెరిగిందట. ముఖ్యంగా దేశంలో ఉన్న టాప్ సెవన్ సిటీసైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూనేల నుంచే ఎక్కువ సెర్చింగ్ ఉందట. ఏసీల కోసం వాకాబు చేస్తున్న ట్రాఫిక్‌లో 61 శాతం ఈ నగరాల నుంచే వస్తోంది.
ఇక ఏసీల కోసం విపరీతంగా సెర్చ్ చేస్తున్న నగరాల్లో ముంబై మొదటి వరుసలో ఉండగా ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలను హైదరాబాద్ ఏసీ డిమాండ్‌లో వెనక్కి నెట్టింది. ఇక విండో ఏసీలతో పోల్చితే నూటికి తొంభై మంది స్లిట్ ఏసీలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని జస్ట్ డయల్ తెలిపింది.
గతంతో పోల్చితే టైర్ 2 సిటీల నుంచి కూడా ఏసీ సెర్చింగ్ ట్రాఫిక్ పెరిగింది. అయితే ఇక్కడ కొత్త ఏసీలు కొనుగోలుకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అదే స్థాయిలో పాత ఏసీల రిపేర్ల కోసం కూడా విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. టైర్ టూ నగరాల్లో ఏసీ రిపేర్ల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్న నగరాల జాబితాలో విశాఖపట్నం, చండీగడ్, జైపూర్, లక్నో, వడోదరలు వరుసగా టాప్ 5లో ఉన్నాయి.
చదవండి: సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్!
Comments
Please login to add a commentAdd a comment