air conditioner market
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి. ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంత తగ్గాయి.. అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ గౌరవ్ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయ న్సెస్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్‌ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్‌లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్ భాగస్వాములు కూలింగ్ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు. -
కంపెనీలకు కలిసొచ్చిన కాలం: హీటెక్కిన రూం ఏసీ మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రూమ్ ఎయిర్ కండీషనర్ల (ఏసీ) మార్కెట్ వేడెక్కింది. వేసవి ముందే రావడం ఇందుకు కారణం. భానుడి ప్రతాపంతో కస్టమర్లు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల కోసం ఎలక్ట్రానిక్స్ షాపులకు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఈ ఉపకరణాలు ఇప్పుడు తప్పనిసరి జాబితాలోకి వచ్చి చేరాయని కంపెనీలు అంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విపణి కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని తయారీ సంస్థలు ధీమాగా ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే 2022 ఫిబ్రవరిలో ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏకంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటే వేసవి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆల్ టైమ్ హైలో విక్రయాలు.. దేశంలో రూమ్ ఏసీ మార్కెట్ విస్తృతి 5-7 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. 2023-24లో పరిశ్రమ ఏకంగా ఒక కోటి యూనిట్ల మార్కును చేరుకుంటుందని బ్లూ స్టార్ చెబుతోంది. ఇదే జరిగితే భారత రూమ్ ఏసీ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేసినట్టు అవుతుంది. 2029 నాటికి పరిశ్రమ 4 కోట్ల యూనిట్లను తాకుతుందని డైకిన్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీలు ఈ సీజన్లో విక్రేతల వద్ద 25 శాతం అధికంగా సరుకు నిల్వ చేశాయి. అంతేగాక తయారీ సామర్థ్యమూ అమ్మకాల తగ్గట్టుగా పెంచుకున్నాయి. భారీగా డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రకటనల బడ్జెట్లనూ అధికం చేశాయని జాన్రైస్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. భారీ అంచనాలతో.. కంపెనీలు ఈ సీజన్లో భారీ అంచనాలతో రెడీ అవుతున్నాయి. 2023 శ్రేణి మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. బ్లూ స్టార్ ఏకంగా 75 మోడళ్లను రంగంలోకి దింపింది. రూమ్ ఏసీ రంగంలో విలువ పరంగా కంపెనీకి ప్రస్తుతం 13.5 శాతం వాటా ఉంది. 2025 మార్చి నాటికి దీనిని 15 శాతానికి చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. శామ్సంగ్ ఈ సీజన్ కోసం విండ్ ఫ్రీ సిరీస్‌తోపాటు మరో 38 మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వేసవి తీవ్రంగా, మరింత ఎక్కువ కాలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ మార్కెట్ బలమైన డిమాండ్‌తో 30 శాతం వృద్ధి చెందవచ్చని గోద్రెజ్ అప్లయాన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండింతల అమ్మకాలను ఆశిస్తున్నట్టు వెల్లడించారు. రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు హాయర్ ప్రకటించింది. -
ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్
వేసవి కాలం ఆరంభంలో ఉండగానే చల్లదనం కోసం హైదరాబాదీలు సెర్చింగ్ మొదలెట్టారు. ఎయిర్ కండీషన్ కోసం తెగ వాకాబు చేస్తున్నారు. జస్ట్ డయల్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఏసీ విషయంలో హైదరాబాద్ నగరం ముంబై, ఢిల్లీలతో పోటీ పడుతోంది. సెర్చింగ్ సైట్ గూగుల్‌లో జస్ట్ డయల్ది ప్రత్యేక స్థానం. ఏదైనా సర్వీస్‌కి సంబంధించిన సమాచారం ఇక్కడ ఠక్కున లభిస్తుంది. అందుకే నెటిజన్లు జస్ట్ డయల్‌ని రెగ్యులర్‌గా క్లిక్ చేస్తుంటారు. వేసవి ఆరంభం నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా రివీల్ చేసిన డేటాలో ఏసీలు కోసం సెర్చింగ్ బాగా పెరిగిందట. ముఖ్యంగా దేశంలో ఉన్న టాప్ సెవన్ సిటీసైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూనేల నుంచే ఎక్కువ సెర్చింగ్ ఉందట. ఏసీల కోసం వాకాబు చేస్తున్న ట్రాఫిక్‌లో 61 శాతం ఈ నగరాల నుంచే వస్తోంది. ఇక ఏసీల కోసం విపరీతంగా సెర్చ్ చేస్తున్న నగరాల్లో ముంబై మొదటి వరుసలో ఉండగా ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలను హైదరాబాద్ ఏసీ డిమాండ్‌లో వెనక్కి నెట్టింది. ఇక విండో ఏసీలతో పోల్చితే నూటికి తొంభై మంది స్లిట్ ఏసీలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని జస్ట్ డయల్ తెలిపింది. గతంతో పోల్చితే టైర్ 2 సిటీల నుంచి కూడా ఏసీ సెర్చింగ్ ట్రాఫిక్ పెరిగింది. అయితే ఇక్కడ కొత్త ఏసీలు కొనుగోలుకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అదే స్థాయిలో పాత ఏసీల రిపేర్ల కోసం కూడా విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. టైర్ టూ నగరాల్లో ఏసీ రిపేర్ల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్న నగరాల జాబితాలో విశాఖపట్నం, చండీగడ్, జైపూర్, లక్నో, వడోదరలు వరుసగా టాప్ 5లో ఉన్నాయి. చదవండి: సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్! -
Air Cooler Sales: ఏసీల విక్రయాలు ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్స్ (ఏసీ), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కరోనా–19 ఎఫెక్ట్ పడింది. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది రెండవ ఏడాది. వైరస్ వ్యాప్తి చెందడం, లాక్డౌన్స్ కారణంగా అత్యంత కీలకమైన వేసవి సీజన్లో సేల్స్ లేకపోవడం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు 75 శాతం పడిపోయాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక మే నెలలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 తగ్గే వరకు ఖర్చులను నియంత్రించుకోవాలన్నది కస్టమర్ల భావనగా ఉందని చెబుతున్నాయి. భారత్‌లో గృహాల్లో వినియోగించే ఏసీల వార్షిక మార్కెట్ 70–75 లక్షల యూనిట్లు. 15కు పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. గతేడాది నుంచీ కష్టాలే.. భారత్‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 2020 ఏప్రిల్‌లో పూర్తిగా నిలిచిపోయాయి. 2019తో పోలిస్తే గతేడాది మే నెలలో 10 శాతానికే అమ్మకాలు పరిమితమయ్యాయి. జూన్‌లో 25 శాతం జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో సేల్స్ 75 శాతం పడిపోయాయి. లాక్డౌన్స్, కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగు అయినట్టేనని పరిశ్రమ చెబుతోంది. సంవత్సరం పొడవునా జరిగే ఏసీ, రిఫ్రిజిరేటర్ల విక్రయాల్లో ఏప్రిల్–జూన్ వాటా 35 శాతం దాకా ఉంటుంది. దేశంలో కేవలం 15 శాతం మార్కెట్ మాత్రమే తెరిచి ఉందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. స్టోర్లకు వచ్చే వినియోగదార్లు అతి తక్కువ అని వివరించారు. ముడి సరుకు భారం అవుతున్నందున ఏసీల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వీటి ధరలు 12 శాతం వరకు అధికమయ్యాయి. లాక్డౌన్స్ ముందు వరకు ఏసీల డిమాండ్ ఉన్నప్పటికీ చిప్ కొరతతో సరఫరా 10 శాతమే ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అంచనాలు తారుమారయ్యాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఉంటుందని భావించినట్టు వోల్టాస్ తెలిపింది. సెకండ్ వేవ్, పరిమితుల కారణంగా లక్ష్యాలను పునర్ పరిశీలించుకోవాల్సి వస్తోందని వివరించింది. తొలి త్రైమాసికం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో సాధించిన విక్రయాలు ఈ ఏడాది కూడా నమోదు చేస్తే అదే ఎక్కువ అని దైకిన్ అంటోంది. మార్చిలో ఏసీ సేల్స్ సానుకూలంగా ప్రారంభమయ్యాయని ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ఒక్కసారిగా కోవిడ్ కేసులు అధికం కావడం, పాక్షిక లాక్డౌన్లతో వేసవి అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. ఏప్రిల్–జూన్ కాలంలో 50% నష్టం అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. స్టాక్ సరిపడ ఉందని గుర్తు చేశారు. లాక్డౌన్స్, కర్ఫ్యూలు జూన్ వరకే ఉంటాయి. అయితే అప్పటికే సీజన్ పూర్తి అవుతుందని హాయర్ అభిప్రాయపడింది. కీలకమైన మే నెలలో సేల్స్ సాధించకపోతే తరువాత చేయలేమని వివరించింది. గతేడాది జూలై, ఆగస్టులో మార్కెట్ పుంజుకుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు అని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
వాటిని కొనేవారు లేక వెలవెలబోతున్న షాప్స్
న్యూఢిల్లీ: సాదారణంగా ప్రతి ఏడాది ఎండ కాలంలో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది కూడా డిమాండ్ భారీగానే ఉంటుందని కంపెనీలు భావించాయి. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఏప్రిల్‌లో కోవిడ్ కేసుల విపరీతంగా పెరగడం వల్ల దాని ప్రభావం ఎయిర్ కండిషనర్లు, కూలర్ల వ్యాపారం మీద పడినట్లు బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. 70శాతం పైగా ఎయిర్ కండీషనర్ అమ్మకాలు జనవరి నుంచి జూన్ మధ్య జరుగుతాయని నివేదికలో తెలిపారు. వాస్తవానికి, "మార్చి నుంచి మే వరకు గల మూడు నెలల కాలంలో 50 శాతం అమ్మకాలు జరుగుతాయి. ఈ కాలంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఆ ప్రభావం పరిశ్రమలపై భారీగానే ఉంటుంది. ఏసీ కొనుగోలు చేయడం వల్ల సాంకేతిక నిపుణులు వచ్చి వాటిని బిగించాలి కాబట్టి, ప్రస్తుత పరిస్థితిలో ఏసీలను కొనుగోలు చేయడానికి సాంకేతిక కారణాలతో వినియోగదారులు వెనుకాడుతున్నారని" అని నివేదిక తెలిపింది. భారతదేశంలోని ప్రాంతాల్లో వేడి వేసవిని అంచనా వేయడంతో పాటు ఏడాది క్రితం నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి కంపెనీలు సీజన్‌కు సిద్ధమయ్యాయి. అలాగే, వేసవి ప్రారంభంలోనే వీటి ధరలను పరిశ్రమలు అధికంగా పెంచేసాయి. ఒకవైపు లాక్ డౌన్ ప్రభావం, మరోవైపు అధిక ధరలు అమ్మకాల మీద ప్రభావం చూపాయి. అనుకున్నంత స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా తగ్గించాయి. చదవండి: బ్రేకింగ్: 5జీ ట్రయల్స్ కు కేంద్రం ఆమోదం -
ఇప్పటికే రూ.2 వేలు పెంపు, మరింత పెరగనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల (ఏసీ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి ముందుగా ప్రారంభం కావడమే ఇందుకు కారణం. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు అంటున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్‌లో ధర 4–5 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలను పెంచాయి. లాక్డౌన్ కారణంగా గతేడాది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో 2021లో కోవిడ్ ముందస్తు స్థాయికి అమ్మకాలు చేరతాయని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. భారత్‌లో ఏసీల పరిశ్రమ 70–75 లక్షల యూనిట్లుగా ఉంది. భారమవుతున్న ముడిసరుకు.. ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ల ధరలూ అధికమవుతూనే వస్తున్నాయి. దేశీయ పరిశ్రమ ఇప్పటికీ పెద్ద ఎత్తున కంప్రెసర్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గత్యంతరం లేక ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. మూడు నెలలుగా ముడిసరుకు వ్యయాలు పెరుగుతూనే ఉన్నాయని లాయిడ్ అంటోంది. తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ ధరలను ఎల్జీ సవరించింది. కొత్త కస్టమర్ల చేరిక.. ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు జోరుగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. ముందస్తుగా అమ్మకాలు మొదలు కావడంతో వేసవి తాపం మాదిరిగానే విక్రయాలు పెరుగుతాయని కంపెనీలు అంటున్నాయి. ఈ సంవత్సరం కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశగా ఉన్నాయి. పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందనే ధీమాతో ఉంది. రవాణా వ్యయాలు భారమవుతున్నాయని హాయర్ చెబుతోంది. 4–5 శాతం ధర పెంచనున్నామని.. అధిక వేసవి దృష్ట్యా సవరించిన ధరల ప్రభావం అమ్మకాలపై ఉండబోదని అంటోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రెండింతల అమ్మకాలు సాధించామని వెల్లడించింది. ముందుగా మొదలైన విక్రయాలు.. విపరీత డిమాండ్ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి తయారీ సామర్థ్యంతో ఏసీ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని ఎల్జీ వెల్లడించింది. 2019తో పోలిస్తే 40 శాతం వృద్ధికి చాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గతేడాది అమ్మకాలు లేకపోవడం, ప్రస్తుతం ఎండలు జోరుగా మొదలు కావడంతో 2021 సీజన్లో ఏసీలకు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంటుందని ప్యానాసోనిక్ చెబుతోంది. మూడు నాలుగు నెలలుగా డిమాండ్ 25 శాతం పెరిగిందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని జోస్యం చెబుతోంది. 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం సేల్స్‌లో 15 శాతంపైగా వృద్ధి ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచే కస్టమర్ల రాక పెరిగిందని అన్నారు. వాహనం... భారం! ► మరోసారి పెంపునకు కంపెనీల సిద్ధం ► ముడి సరుకు వ్యయాల ప్రభావం ► ఇప్పటికే పెరిగిన పలు మోడళ్ల ధర చెన్నై: వాహనాల ధరలు మరోసారి పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఇతర ముడి సరుకు వ్యయాలే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి 1–3 శాతం ధరలు అధికం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ, మోడల్‌నుబట్టి వాహనం ధర రూ.45,000 వరకు పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వాహనాల ధరలను సవరించే అవకాశం ఉంది. మరోవైపు బీఎస్–4 నుంచి బీఎస్–6కి మళ్లిన సమయంలో వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పదార్థాల భారం.. ముడి పదార్థాల ఖర్చులు అధికం అయ్యాయని ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. వాణిజ్య వాహనాలతోపాటు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ ధరలనూ పెంచుతామన్నారు. ‘అక్టోబరు, జనవరిలో ధరలను పెంచాం. స్టీల్, ప్రత్యేక ఖనిజాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగితే ధరల సవరణ తప్ప మరో మార్గం లేదు’ అని అశోక్ లేలాండ్ సీఎఫ్‌వో, డైరెక్టర్ గోపాల్ మహదేవన్ అన్నారు. ఏప్రిల్–జూన్‌లో వాణిజ్య వాహనాలతోపాటు ఎస్‌యూవీల ప్రైస్ పెంచనున్నట్టు మహీంద్రా గ్రూప్ ఆటో ఈడీ రాజేశ్ జేజూరికర్ వెల్లడించారు. -
ఏసీల మార్కెట్లో ‘హీట్’!
⇒ భానుడి ప్రతాపంతో అమ్మకాల జోరు ⇒ విక్రయాలు 57.5 లక్షల యూనిట్లకు ⇒ అంచనా వేస్తున్న ఏసీ కంపెనీలు ⇒ ఇన్వర్టర్ ఏసీలకు పెరిగిన డిమాండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల మార్కెట్ జోరు మీద ఉంది. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరం అమ్మకాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. వేసవి ఈసారి ముందుగా ప్రారంభం కావడంతోపాటు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఎండ తీవ్రత 2 డిగ్రీలు ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇంకేముంది భానుడి ప్రతాపంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే జోష్‌తో కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016లో 50 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2017లో 57.5 లక్షల యూనిట్లు దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌లోపు కొంటే ప్రయోజనం.. ఏసీల తయారీలో వాడే ముడి పదార్థాల ధర అంతర్జాతీయంగా పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ కంపెనీలు ధరలను సవరించడం లేదు. ప్రస్తుతం ఏసీల ధర పెరిగే అవకాశం లేదని బ్లూస్టార్ ఈడీ బి.త్యాగరాజన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. జూన్‌లోపు కొనుగోలు చేసిన వారికి ప్రయోజనమని చెప్పారు. ఆ తర్వాత జీఎస్టీ అమలవుతుందని, తద్వారా ఏసీల ధర 7% దాకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమపై ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. ఇక విక్రయాల పరంగా మెట్రోయేతర నగరాలు, పట్టణాల వాటా 55 శాతముందని వివరించారు. దేశంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై, తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏసీల అమ్మకాల్లో ముందంజలో ఉన్నాయి. కాపర్‌తో తయారైన మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. విద్యుత్‌ను ఆదాచేసే.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) రేటింగ్ ప్రమాణాలు 2018 జనవరి 1 నుంచి మారుతున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతమున్న 5 స్టార్ కాస్తా 3 స్టార్ అవుతుంది. అంటే ప్రమాణాలు మరింత కఠినం అవుతాయన్న మాట. ఇక 3 స్టార్ మోడళ్ల వాటా ఇప్పుడు ఏకంగా 50 శాతంపైగా ఉంది. నూతన రేటింగ్ ప్రమాణాలు అమలైతే విద్యుత్‌ను గణనీయంగా ఆదాచేసే ఇన్వర్టర్ ఏసీల విక్రయాలు జోరందుకుంటాయని ప్యానాసోనిక్ అంటోంది. మొత్తం అమ్మకాల్లో ఇన్వర్టర్ ఏసీల వాటా ప్రస్తుతం 10 శాతముంది. 2017లో ఇది 15 శాతానికి చేరొచ్చని బ్లూస్టార్ తెలిపింది. ఈ విభాగం మోడళ్ల ధర తగ్గుతూ వస్తోందని పేర్కొంది. వృద్ధి రేటు 50% ఉందని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ చెప్పారు. బ్లూ స్టార్ 80% వృద్ధిని నమోదు చేసిందన్నారు. హైదరాబాద్‌లో ఇన్వర్టర్ ఏసీలకు డిమాండ్ గతం కంటే ఎక్కువగా ఉందని.. ఈ వేసవి కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్ కె.శ్రీనివాస్ తెలిపారు. డౌన్ పేమెంట్ లేకుండానే ఏసీని సొంతం చేసుకోవచ్చన్నారు. పోటాపోటీగా మోడళ్లు..: ప్రపంచంలో తొలిసారిగా గుండ్రని ఆకారంలో ఏసీలను శాంసంగ్ తయారు చేసింది. బిల్ట్ ఇన్ ఎయిర్ ప్యూరిఫయర్లతో పలు ఏసీలను ప్యానాసోనిక్ విడుదల చేసింది. సోలార్‌తో నడిచే హైబ్రిడ్ ఏసీలను వీడియోకాన్ ఆవిష్కరించింది. ధర రూ.99 వేల నుంచి ప్రారంభం. 2017లో 6.5 లక్షల యూనిట్లను విక్రయిస్తామని వీడియోకాన్ ఏసీ విభాగం సీవోవో సంజీవ్ బక్షి చెప్పారు. కంపెనీ వాటాను ప్రస్తుత 9 శాతం నుంచి 13కు చేరుస్తామన్నారు. నూతన తరం ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలను బ్లూ స్టార్ విడుదల చేసింది. ఈ ఏడాది బ్లూస్టార్ 20% వృద్ధి అంచనా వేస్తోంది. 10% మార్కెట్ వాటా, 30 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకున్నట్టు ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఏసీలను ఎల్జీ విడుదల చేసింది.