శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రోడ్డులో టైటాన్ వాచ్ షోరూంలో సోమవారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ. 15లక్షల విలువైన వాచీలు, లక్ష రూపాయల నగదు అపహరణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. టైటాన్ వాచ్ షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.