ముంబై: 10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం ఏకంగా రూ.186 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ నేటి(ఫిబ్రవరి 15) ట్రేడింగ్‌లో ధగధగా మెరిసాయి. దాదాపు టైటాన్ కంపెనీ 4 శాతం, టాటా మోటార్స్ 5 శాతం ర్యాలీ చేసింది.
టైటాన్ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో ₹2398 వద్ద ముగిసింది. అయితే ఇది ఈ రోజు ఉదయం 9:25 గంటలకు ప్రతి షేరు ధర స్థాయిలకు ₹2435 వరకు పెరిగింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే 10 నిమిషాల్లో ప్రతి షేరు పెరుగుదలకు ₹37 పెరిగింది. అదేవిధంగా, మరో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హోల్డింగ్ కంపెనీ స్టాక్ టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు ప్రారంభ గంటలో తలక్రిందులుగా తెరుచుకున్నాయి. టాటా మోటార్స్ షేర్ ధర ఈ రోజు +27.55(5.84%) పెరిగి రూ.499.00కు చేరుకుంది.
అక్టోబర్ - డిసెంబర్ 2021 త్రైమాసీకంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు కంపెనీలో వాటా ఉంది. రాకేష్ ఝుంఝున్ వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖా ఝున్‌ఝున్‌వాలా సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్ ఝుంఝున్ వాలా, రేఖా ఝుంఝున్ వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు.
(చదవండి: ఇండియన్ ఇంజనీర్ల అద్భుతం! జేమ్స్‌బాండ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిందే)
Comments
Please login to add a commentAdd a comment