
టైటాన్ కొత్త స్మార్ట్‌వాచ్ ‘జక్ట్స్ ప్రో’
హైదరాబాద్: ప్రముఖ వాచీల తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా ‘జక్ట్స్ ప్రో’ టచ్‌స్క్రీన్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.22,995. ఈ వాచ్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 20 ప్రి-లోడెడ్ డిజైన్లతో కూడిన కస్టమైజ్డ్ వాచ్ డయల్, 4 జీబీ మెమరీ, ఎస్‌ఎంఎస్/ఈ-మెయిల్/వాట్సాప్/కాల్ అలర్ట్స్ నోటిఫికేషన్స్, అలారమ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఫోన్ ఫైండర్, ఫోన్ కెమెరా/మ్యూజిక్ కంట్రోల్, క్లౌడ్ సపోర్ట్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. వినియోగదారులు ఈ వాచ్‌లను టైటాన్ షాపులు సహా ఇతర మల్టీబ్రాండెడ్ ఔట్‌లెట్స్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో పొందొచ్చని తెలిపింది.