Titan Q2 Results: టైటాన్ కంపెనీ ఈ ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో డబుల్ ధమాకా కొట్టేసింది. క్యూ2లో 270శాతం వృద్ధితో సుమారు రూ. 641 కోట్ల ఏకీకృత నికర లాభాలను సొంతం చేసుకుంది. గత ఏడాది క్యూ2లో టైటాన్ సుమారు రూ.173 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో టైటాన్ జ్వువెలరీ కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్వువెలరీ విభాగంలో క్యూ2లో రూ. 4,127 కోట్ల నుంచి 75 శాతం పెరిగి రూ.7,243 కోట్లకు చేరుకుంది. ఆదాయం సుమారు 78 శాతం మేర పెరిగింది.
టైటాన్ జ్వువెలరీ విభాగంలో గత ఏడాదిలో క్యూ2లో రూ. 3446 కోట్లను నివేదించగా, ఈ ఏడాదిగాను 77శాతం వృద్ధితో రూ. 6,106 కోట్ల ఆదాయాన్ని గడించింది. టైటాన్ గడియారాలు, వెయిరబుల్స్ మార్కెట్‌లో క్యూ2లో 72 శాతం వృద్ధితో 687 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు కళ్లజోడు వ్యాపారంలో కూడా భారీ గ్రోత్‌నే సాధించింది. ఈ ఏడాది క్యూ2లో 70 శాతం వృద్ధితో రూ. 160 కోట్లను ఆదాయాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికె వెంకటరామన్ మాట్లాడుతూ...ఈ త్రైమాసికంలో టైటాన్ బలమైన వృద్ధి నమోదుచేసింది. డిమాండ్ ఉండడటంతో అన్ని విభాగాల్లో బలంగా పుంజుకుందని పేర్కొన్నారు.
చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..!
Comments
Please login to add a commentAdd a comment