అదరగొట్టిన టీవీఎస్‌ మోటార్స్‌..! | Tvs Motor Company Reports Highest Ever Revenue In Q2 Fy 2022 | Sakshi
Sakshi News home page

TVS Motor: అదరగొట్టిన టీవీఎస్‌ మోటార్స్‌..!

Published Sat, Oct 23 2021 7:43 PM | Last Updated on Sat, Oct 23 2021 7:48 PM

Tvs Motor Company Reports Highest Ever Revenue In Q2 Fy 2022 - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటర్స్‌  (2021-22) ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 ​​కోట్లను సొంతం చేసుకోగా... గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెండో త్రైమాసికంలో 22 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.  క్యూ2లో రూ.277.60 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 196.3 కోట్ల నికర లాభాలను సాధించింది. 
చదవండి: వ్యాక్సిన్‌ వేసుకోకుంటే జీతం కట్‌! ఆ కంపెనీ సంచలన నిర్ణయం

ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న కంటైనర్లు, సెమీకండక్టర్ల కొరత ఉన్న‍ప్పటికీ టీవీఎస్‌ మోటార్స్‌ గణనీయంగా లాభాలను పొందింది. పన్ను ముందు లాభాలు సుమారు 41 శాతం పెరిగి రూ. 377 కోట్లకు చేరుకుంది, అదే సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ₹ 267 కోట్లును టీవీఎస్‌ మోటార్స్‌ ఆర్జించింది.

జూలై నుంచి సెప్టెంబర్ 2021 కాలంలో..సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలను టీవీఎస్‌ జరిపింది. బజాజ్‌ ఆటో తర్వాత భారత నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసే రెండో అతిపెద్ద కంపెనీగా టీవీఎస్‌ మోటార్స్‌ నిలుస్తోంది. 
చదవండి: ఫ్యూచర్‌ వీటిదేనా? లాభాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement