
టైటాన్ లాభం రూ.127 కోట్లు
జూన్ త్రైమాసికంలో 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.127 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.151 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైందని టైటాన్ కంపెనీ తెలిపింది. గత క్యూ1లో రూ.2,587 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగాయని టైటాన్ ఎండీ భాస్కర్ భట్ చెప్పారు. ఆభరణాల విభాగం ఆదాయం రూ.2,073 కోట్ల నుంచి రూ.2,138 కోట్లకు, వాచ్‌ల విభాగం ఆదాయం రూ.485 కోట్ల నుంచి రూ.492 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.