![Titan buys HUG Innovations to strengthen smart wearables play - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/12/titan%20smart%20watch.jpg.webp?itok=z1qo-gGr)
సాక్షి, ముంబై: కంజ్యూమర్ గూడ్స్ రంగ సంస్థ టైటన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్ కంపెనీ హగ్ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్ ఫౌండర్ రాజ్ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్ వాచెస్, వేరబుల్స్ విభాగం సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. దీనిని టైటన్ హైదరాబాద్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మార్చినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేప్రణాళికలో భాగంగా హగ్‌ను సొంతం చేసుకుంది. అయితే డీల్ విలువ వివరాలను రవికాంత్ వెల్లడించలేదు.
అలాగే ‘కనెక్టెడ్ ఎక్స్ ’ పేరుతో టైటన్ ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. టైటన్ పోర్ట్‌ఫోలియోలో ఇది టైటాన్ యొక్క 13 వ ఉత్పత్తి. మార్చి నుంచి ఈ స్మార్ట్ వాచ్ అన్ని ప్రముఖ టైటాన్ స్టోర్లలో లభిస్తుంది. 1.2 అంగుళాల ఫుల్ కలర్ టచ్‌స్క్రీన్ , స్మార్ట్ వాచ్ అనలాగ్ హ్యాండ్స్, యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్ అలర్ట్స్ లాంటి 13 టెక్ ఫీచర్లతో లోడ్ చేయబడిన మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ వాచ్ ధర రూ.14,995గా కంపెనీ నిర్ణయించింది.
కాగా అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసుకునే నేరావటి 2012లో నిర్భయ ఘటన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి మహిళల భద్రతా సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని గచిబౌలిలో స్టార్టప్ సంస్థ హగ్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించారు. ఫాక్స్కాన్, ఫిట్నెస్ బ్యాండ్ల సహకారంతో భద్రతా లక్షణాలతో పలు స్మార్ట్ వాచ్‌లను హగ్ రూపొందించిది. 30వేల మంది కస్టమర్లను హగ్ సొంతం.
Comments
Please login to add a commentAdd a comment