- టెన్త్‌లో 79.96 శాతం ఉత్తీర్ణత
- తూర్పుగోదావరి ఫస్ట్.. ఆదిలాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయి. అయితే ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ గురుకులాలు మాత్రం ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలోనే ప్రైవేటు స్కూళ్లు నిలిచాయి. మొత్తం 10,61,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 88.62 శాతం ఉత్తీర్ణత నమోదరు్యంది. 95.41 శాతం ఉత్తీర్ణతతో ఏపీ గురుకులాలు ముందంజలో ఉండగా, 79.96 శాతంతో ప్రభుత్వ పాఠశాలలు చివరి స్థానంలో ఉన్నాయి.
93.04 శాతం ఉత్తీర్ణతతో ప్రైవేటు పాఠశాలలు రెండో స్థానంలో నిలిచారు. ఎయిడెడ్ స్కూళ్లు 83.29 శాతం ఉత్తీర్ణత సాధించగా, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 85.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, 58.31 శాతంతో ఆదిలాబాద్ చివరి స్థానంలోకి వెళ్లింది. కడప రెండో స్థానంలో (95.14 శాతం), వరంగల్ మూడో స్థానంలో (94.54 శాతం), మహబూబ్‌నగర్ నాలుగో స్థానంలో (93.77 శాతం), కర్నూలు ఐదో స్థానంలో (93.23 శాతం) నిలిచారు.
వెనుకబడిన సర్కారీ స్కూళ్లు
Published Fri, May 16 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement