
గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు
విశాఖ జిల్లా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న గంటా శ్రీనివాసరావుపై ఎన్నికల కమిషన్కు సీపీఎం వర్గాలు ఫిర్యాదు చేశాయి. గంటా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరాయి.
ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న ప్రత్యూష కంపెనీలో గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉన్నట్లు సీపీఎం నాయకులు తమ ఫిర్యాదులో తెలిపారు. 11.37 కోట్ల రూపాయల ఆదాయానికి తాను దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో గంటా శ్రీనివాసరావు ఆధారాలు చూపించలేదని ఆరోపించారు.