విశాఖలో వైఎస్ విజయమ్మకు సీపీఎం మద్దతు!
విశాఖపట్నం: జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధి సబ్బం హరి పోటి నుంచి తప్పుకోవడంపై సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ లోకసభ అభ్యర్ధి వైఎస్ విజయమ్మకు సీపీఎం మద్దతు తెలుపుతుందని ఆపార్టీ నేత బి.గంగారావు ప్రకటించారు.
మాజీ ఎంపి సబ్బంహరి తీరుపై సీపీఎం మండిపడింది. సబ్బంహరి పోటీ నుంచి విరమించుకుని బీజేపీకి ఓటువేయమని చెప్పడం కోడ్ ఉల్లంఘనే అని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అన్నారు.
సబ్బంహరికి మద్దతు విరమించుకున్నామని బి.గంగారావు తెలిపారు. బేషరతుగా వైఎస్ విజయమ్మకే మా మద్దతు అని బి.గంగారావు మీడియాకు వెల్లడించారు.