మధ్యాహ్నం ఒంటిగంటకు విజయమ్మ నామినేషన్ | ys Vijayamma will be filed nomination at 1pm | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం ఒంటిగంటకు విజయమ్మ నామినేషన్

Published Thu, Apr 17 2014 9:46 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

మధ్యాహ్నం ఒంటిగంటకు విజయమ్మ నామినేషన్ - Sakshi

మధ్యాహ్నం ఒంటిగంటకు విజయమ్మ నామినేషన్

విశాఖపట్నం:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ  గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు  నామినేషన్‌ వేయనున్నారు. విజయమ్మకు మద్దతివ్వడానికి ఉత్తరాంధ్ర నుంచి భారీస్థాయిలో అభిమానులు, కార్యకర్తలు కదలిరానున్నారు. విజయమ్మ తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని తెలిసి ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలు అందరూ తరలి వస్తున్నారు.

విజయమ్మ ఉదయం 10 గంటలకు పార్టీ నగర కార్యాలయానికి చేరుకుంటారు.కార్యాలయంలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. 11 గంటలకు జగదాంబ సెంటర్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు బయలుదేరతారు. కలెక్టరేట్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఒంటి గంట సమయంలో విజయమ్మ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె వెంట కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement