పాడేరు రూరల్ : ఆయన విజయనగరం జిల్లా కురుపాం జమీందారి వంశానికి చెందిన రాజు. ఆయన రాజకీయ ప్రస్థానం చాలా గణనీయమైనది. 1977లోనే అతి చిన్న వయస్సులోనే తొలిసారి ఎంపీగా మంత్రి అయిన చరిత్ర ఆయనది. ఏకధాటిగా 5 సార్లు ఎంపీగా, ఓసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయనకు పాతికేళ్లుగా పట్టం కట్టిన గిరిజనులకు, గిరిజన ప్రాంత అభివృద్ధికి ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు. కనీస ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేని ప్రజా ప్రతినిధిగా అపఖ్యాతిని కూడగట్టుకున్నారు. స్థానిక గిరిజనుల ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే గిరిజనులకు అందుబాటులో ఉండరని, నిత్యం ఢిల్లీలోనే మకాం వేస్తారనే అపవాదు ఉంది. రాజకీయ ఉద్దండుడైన ఆయనను ఓ సామాన్యమైన గిరిజన మహిళ గొడ్డేటి మాధవి ఈ ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థిగా ఢీకొం టుంది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం శరభన్న పాలెం గ్రామానికి చెందిన గొడ్డేటి మాధవి సామాన్య గిరిజన మహిళ. ఈమె తండ్రి దివంగత గొడ్డేటి దేముడు చింతపల్లి నియోజకవర్గం ఉన్న సమయంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తీరు పరిశీలిస్తే..
చిక్కరు..దొరకరు కిశోర్ చంద్రదేవ్ అరకు టీడీపీ ఎంపీ అభ్యర్థి
♦ 5సార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
♦ 2009లో అరకు పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు.
♦ గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పనిచేసి అదే సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేయలేదు.
♦ ప్రజలకు ఏనాడూ అందుబాటులో ఉండరు.
♦ 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్, ప్రకృతి వైఫరీత్యాల కారణంగా గిరిజన ప్రాంతం అతలాకుతలమైన సందర్భాల్లో కూడా కనీసం ఆయన చుట్టం చూపుగా కూడా రాలేదు.
♦ విశాఖ ఏజెన్సీలో ఉన్న సుమారు 30వేల కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత తనదని చెప్పి అందలమెక్కాక వారిని పూర్తిగా విస్మరించారు.
♦ ఏజెన్సీలో ప్రధాన కూడళ్ల వద్ద ప్రయాణికుల విశ్రాంతి భవనాలు, ప్రధాన పంచాయతీలో సామాజిక భవనాలు, నిర్మించలేదు. శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్న ఒడిశాలోని గూన్‌పూర్ నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు మీదుగా అరకు రైల్వే లైన్ కలిపి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు విస్తారిస్తామన్న హామీ, అరకు నుంచి పాడేరు మీదుగా నర్సీపట్నం వరకు కొత్త రైల్వే లైన్ వేస్తామని చేసిన వాగ్దానాలు మరిచారు.
♦ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు దండుకుని ముఖం చాటేస్తారనే అభిప్రాయం గిరిజనుల్లో బలంగా ఉంది.
నిత్యం ప్రజా సేవలోనే గొడ్డేటి మాధవి వైఎస్సార్‌సీపీఎంపీ అభ్యర్థి
♦ మాధవి తండ్రి గొడ్డేటి దేముడు చింతపల్లి నియోజకవర్గంలో 1994–1999, 2004–2009 కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందరితో కలిసి మెలసి ఉంటూ గిరిజనుల కష్టాల్లో పాలుపంచుకునేవారు. సౌమ్యుడిగా పేరుపొందిన గొడ్డేటి దేముడు మృధుస్వభావి. ఎమ్మెల్యే అనే హోదా లేకుండా సాదాసీదాగా స్థానిక గిరిజనులతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు. ఆయన మరణాంతరం పిన్న వయస్సులోనే తండ్రికి తగ్గ తనయురాలిగా గొడ్టేడి మాధవి పేరు తెచ్చుకున్నారు.
♦ తండ్రి ఆశయ సాధనకోసం జగనన్న పిలుపుతో రాజకీయాల్లో చేరారు.
♦ వైఎన్ పాకలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో పిఈటీగా పనిచేస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపందుకుని వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
♦ పార్టీలో చేరినప్పటి నుండి ఆమె కూడా తండ్రి బాటలో నడుస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
♦ సామాన్య గిరిజన మహిళ అయిన మాధవి చిన్న వయస్సులోనే ఎంపీగా పోటీ చేస్తున్నారు.
♦ పేద వర్గాల పట్ల అభిమానానికి నిదర్శనంగా రాజకీయంగా వెనుకబడిన సామాజిక వర్గం నుండి ఈమెకు జగనన్న అరకు పార్లమెంట్ అభ్యర్థినిగా ప్రకటించి సముచిత స్థానం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment