అనకాపల్లి : ఒకరు రోగుల సేవలో చల్లని చేయి అనిపించుకున్న మనసున్న డాక్టరమ్మ...మరొకరు విలాసమే తప్ప సేవ ఊసైనా పట్టని డెయిరీ ‘పాల’కుడు. ఇద్దరి వ్యక్తిత్వంలో ఎంతో అంతరం. ఒకరు వైద్యం, ఆధ్యాతిక సేవల్లో నిరంతరం ప్రజల మన్ననలు పొందుతుంటే...మరొకరు ‘సహకారం’ పేరిట ధనస్వామ్యం నెరపుతున్న కుటుంబానికి వారసుడు. ఒకరు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సత్యవతి. మరొకరు టీడీపీ ఎంపీఅభ్యర్థి ఆనంద్. ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తే...
సేవా దృక్పథంవైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి
♦ ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యురాలు సేవాదృక్పథం కలిగిన విద్యావేత్త
♦ రాజకీయ కుటుంబానికి కోడలిగా వెళ్లిన సత్యవతి
♦ ఆస్పత్రికి వచ్చిన రోగుల నుంచి ఏమాత్రం డబ్బులు అధికంగా తీసుకోకుండా వ్యవహరించే వ్యక్తిత్వం
♦ కుటుంబంలోని భర్త, పిల్లలు వైద్యులు
♦ వివేకానంద చారిటబుల్ ట్రస్టు పేరిట వైద్యం, ఆధ్యాత్మిక సేవలు
♦ అందరి నోటా అమ్మా అని పిలిపించుకునే వ్యక్తిత్వం
♦ వర్తమాన అంశాలపై సామాజిక కార్యక్రమాలపై అనర్గళంగా మాట్లాడే విజ్ఞానం
♦ ప్రత్యేకహోదాతో పాటు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అవసరమైన వనరులపై మాట్లాడే అవగాహన
♦ ఆస్పత్రి పరిధిలోని సిబ్బంది పట్ల ఆప్యాయంగా ఉండడంతో పాటు వైద్యసేవల నిమిత్తం వచ్చే రోగుల కష్టసుఖాలను అడిగి తెలుసుకునే మనస్తత్వం
విలాసాల దారిలో..టీడీపీఎంపీఅభ్యర్థి ఆనంద్: విలాస జీవితం
♦ విశాఖ డెయిరీలో డైరెక్టర్‌గా అడ్డగోలుగా నియామకం
♦ సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చుకొని సొంతం చేసుకున్న కుటుంబంలోని వ్యక్తి
♦ డెయిరీ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా నిర్మించిన ఆస్పత్రిని లీజు రూపంలో వేరొకరికి ధారాదత్తం చేసిన వైనం
♦ ఈ విడత ఎన్నికలలో తప్ప అంతకుముందు ప్రజల ముందుకు రాని వ్యక్తిగా గుర్తింపు
♦ కేవలం విశాఖ డెయిరీ చైర్మన్ వారసుడిగానే గుర్తింపు తప్ప పార్లమెంట్ పరిధిలో రాజకీయపరంగా పరిచయం లేని వ్యక్తి
♦ తరచూ విదేశాల్లో పర్యటించే అలవాటు
♦ ఎంపీగా పోటీ చేసేటప్పుడు ప్రత్యేకహోదా, అనకాపల్లి పార్లమెంట్ సమస్యలపై ప్రస్తావించని వైఖరి
♦ తన సంస్థలో పని చేసే వ్యక్తుల పట్ల చిర్రుబుర్రులాడే మనస్తత్వం
Comments
Please login to add a commentAdd a comment