కోట్లాదిమందికి ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే: విజయమ్మ | YS Vijayamma campaigns in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

కోట్లాదిమందికి ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే: విజయమ్మ

Published Fri, May 2 2014 7:13 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

కోట్లాదిమందికి ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే: విజయమ్మ - Sakshi

కోట్లాదిమందికి ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే: విజయమ్మ

విశాఖపట్నం: రాష్ట్రంలో కోట్లాదిమందికి ఉచితంగా వైద్యం  అందించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా పరవాడలో జరిగిన సభలో విజయమ్మ ప్రసంగించారు.

విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేసింది వైఎస్ఆర్‌ అని చెప్పారు. అటువంటి వైఎస్ఆర్ పాలన కోసం ఆలోచన చేయాలని విజయమ్మ ప్రజలను కోరారు. ఎన్టీఆర్ పథకాలనే చంద్రబాబు అమలు చేయలేకపోయారని, ఆ పాలన ఒక పీడకలని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు పాలను ఏ రైతూ మర్చిపోడని విజయమ్మ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను చంద్రబాబు తన అనుచరులకే ధారాదత్తం చేశాడని విమర్శించారు. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు తీసేసారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంను అభివృద్ధి చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్‌గా ఎలాచేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజయమ్మ ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement