ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ నరసింహన్ ను కోరారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ మంగళవారం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రిని పిలిచి గవర్నర్ మాట్లాడతానన్నారని చెప్పారు. పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Published Tue, Nov 18 2014 8:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement