
21న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2015 పరీక్షా ఫలితాలు ఈనెల 21వ తేదీన కాకినాడలోని జేఎన్ టీయూ క్యాంపస్‌లో విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను ర్యాంకుల రూపంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులకు ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇస్తూ ఈ ర్యాంకులను ప్రకటించనున్నారు.