ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్తో మంతనాలు జరిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం ముందు తమ వాదనలు బలంగా వినిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే వీరు ఎప్పుడు ఢిల్లీ వెళతారనే దానిపై స్పష్టత లేదు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మరో ఇద్దరు సీమాంధ్రకు చెందిన మంత్రులు కూడా రేపు గవర్నర్ను కలసి తమ రాజీనామా లేఖలను అందజేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.