
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.
ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్‌కి వచ్చే లెక్చరర్ చైర్‌లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు.
లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్‌లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్‌కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.
తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment