న్యూస్‌మేకర్
కుమార్తెను ప్రోత్సహించడానికి తండ్రి ఎవరెస్ట్‌లా నిలబడితే ఏ కుమారై్తనా ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి వెనుకాడదు. ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్య
తన తండ్రితో కలిసి తొమ్మిదో ఏటనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తాకగలిగింది. ఇప్పుడు తండ్రిని తోడు చేసుకుని ఎవరెస్ట్‌నే అధిరోహించింది. ఎవరెస్ట్‌ను ఎక్కిన బాలికలలో ఈమెది రెండో చిన్న వయసు. కామ్య సాహసయాత్ర విశేషాలు.
కొన్ని విజయాలు పుట్టుకతోనే నిర్థారితమవుతాయి. ముంబైలోని నేవీ స్కూల్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ తాజా ఘన విజయం చూస్తే ఆ మాటే అనాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించిందామె. మే 20న ఎవరెస్ట్ అధిరోహణతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన రెండవ చిన్న వయసు మౌంటెనీర్‌గా, మన దేశం నుంచైతే మొట్ట మొదటి చిన్న వయసు మౌంటనీర్‌గా రికార్డ్ సృష్టించింది. దీని వెనుక కామ్య తండ్రి కార్తికేయన్ ఉన్నాడు. తల్లి లావణ్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఊహ తెలిసిన వెంటనే కనిపించిన సహ్యాద్రి పర్వతాలున్నాయి.
మూడేళ్ల వయసు నుంచే
కావ్య తండ్రి కార్తికేయన్ నేవీలో ఆఫీసర్. అతని ΄ోస్టింగ్ లోనావాలాలో ఉండగా కావ్యాకు మూడేళ్లు. వీకెండ్స్‌లో ఆమె తల్లిదండ్రులిద్దరూ సహ్యాద్రి పర్వతాల్లో విహారానికి కావ్యను తీసుకెళ్లేవారు. ఐదారేళ్లు వచ్చేసరికి సహ్యాద్రిలో ఆమె కాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రకృతి కామ్యను ఆకర్షించింది. పర్వతాలు హద్దుల్లేని ప్రయాణం చేయమని స్ఫూర్తినిచ్చాయి. కామ్యలోని చురుకుదనాన్ని చూసి పర్వతారోహణలో ఆమెను ప్రోత్సహించాలని కార్తికేయన్ నిశ్చయించుకున్నాడు.
మొదటి లిట్మస్ టెస్ట్
కామ్యకు 9 ఏళ్ల వయసు ఉండగా కార్తికేయన్ ఆమెను పర్వతారోహణలో నిలదొక్కుకోగలదో లేదో పరీక్షించడానికి లదాఖ్ తీసుకెళ్లాడు. అక్కడి మౌంట్ స్టాక్ కంగ్రీని 6000 అడుగుల ఎత్తు మేర ఆమె అధిరోహించింది. ప్రతికూల వాతావరణంలో ఆ వయసులో ఆమె చేసిన అధిరోహణ కార్తికేయన్‌కు నమ్మకమిచ్చింది. దాంతో తన కూతురు చిన్న వయసులోనే అన్ని ఖండాల్లోని పర్వతాలు అధిరోహించాలని అతడుప్రోత్సహించాడు. కామ్య ఆ సవాలును స్వీకరించింది. అలా మొదలైంది వారి ‘సాహస్’ యాత్ర.
7 ఖండాల సాహస్
కామ్య ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ అధిరోహించాలని నిశ్చయించుకుంది. ఆ యాత్రకు ‘సాహస్’ అని పేరు పెట్టుకుంది. ‘అయితే అది అంత సులువైన పని కాదు. మానసికంగా శారీరకంగా వైద్యానికి స్పందించే విధంగా మన శరీరం మనసు ఉండాలి. అందుకని నేను రోజుకు ఆరు గంటలు సైక్లింగ్, రన్నింగ్ చేసేదాన్ని’ అని తెలిపింది కామ్య. తన సాహస యాత్ర మొదలెట్టే ముందు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎం.ఎస్. కోలిని కలిస్తే ‘పర్వతాలు ఎన్నో కథలను నీకు ఇస్తాయి. అవి జీవితాంతం గొప్పగా నీతో మిగులుతాయి. గో అహేడ్’ అని ఆశీర్వదించాడు. కామ్య ఆగలేదు. తండ్రితో పాటు 2017లో కిలిమంజారో (ఆఫ్రికా), ఆ తర్వాతి సంవత్సరం మౌంట్ ఎల్‌బ్రుస్ (యూరప్), ఆ తర్వాత మౌంట్ కోసియుస్కొ (ఆస్ట్రేలియా), మౌంట్ అకొంకగువా (సౌత్ అమెరికా), మౌంట్ డెనాలి (నార్త్ అమెరికా) అధిరోహించింది. మే 20న మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) అధిరోహించడంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ ఒక్కటే చేరడం మిగిలింది.
ఎవరెస్ట్ అధిరోహణ
మే 20న ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరడానికి ఏప్రిల్ 6 నుంచి కామ్య, ఆమె తండ్రి కార్తికేయన్ ప్రయాణం మొదలైంది. అధిరోహించేది ఎవరెస్ట్ కనుక ట్రైనింగ్, షాపింగ్, ΄్యాకింగ్, ట్రావెల్ పకడ్బందీగా ΄్లాన్ చేసుకున్నారు. మొదట ఖట్మాండు చేరుకుని అక్కడి నుంచి విమానం ద్వారా లుక్లా ఎయిర్΄ోర్ట్‌కు చేరుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఇది మొదటి మజిలీ. అక్కడి నుంచి ఆరోహణ ్రపారంభించి ఫాక్‌డింగ్ (2610 మీటర్లు) నుంచి నామ్‌చే బజార్ (3440 మీటర్లు) చేరుకున్నారు. అక్కడ విరామం తీసుకున్నాక టెంగ్‌బోచె (3860 మీటర్లు)కు ట్రెక్ సాగింది.
ఆ తర్వాత లొబొచె (4940 మీటర్లు) చేరుకుని ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆక్సిజన్ పరికరాలు ఉపయోగిస్తూ పర్వతారోహణ ఎలా చేయాలో, పైకి కొనసాగే సమయంలో సేఫ్టీ పరికరాలు ఎలా ఉపయోగించాలో ట్రయినింగ్ తీసుకున్నారు. శిఖరాగ్రం చేరుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేక΄ోవడంతో మే 15 వరకూ బేస్ క్యాంప్‌లోనే ఉండాల్సి వచ్చింది. మే 15న బయలుదేరి మే 20 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కామ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. 8, 849 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ శిఖరంపైన తన తండ్రితో పాటు నిలబడి కామ్య తన విజయాన్ని ఆస్వాదించింది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది.
Comments
Please login to add a commentAdd a comment