Climbing Everest Mountain
-
క్లైంబింగ్.. సాహసోపేతం
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో ఊహించడమే చాలా కష్టం.. అలాంటిది ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తూ మనిíÙకి అసాధ్యమంటూ ఏమీ లేదని నిరూపిస్తుంటారు కొందరు పర్వతారోహకులు. ఈ పర్వతారోహణం అనేది గొప్ప ప్రయత్నంగా కీర్తించబడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని అందిస్తుంది. ఈ పర్వతారోహణలో భారతీయులు కూడా సత్తాచాటిన సందర్భాలు ఎన్నో.. హిమాలయాలు మొదలు వివిధ ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత పతాకాన్ని సగర్వంగా నిలిపిన సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పర్వతారోహణం అంత సులువు కాదు, విపత్కర పరిస్థితులకు క్లైంబింగ్ ప్రధానమైన ప్రయత్నమని పలువురు పర్వతారోహకులు చెబుతున్నారు. దీనికంటూ ప్రత్యేక శిక్షణ, అనుభవం అవసరమని హెచ్చరిస్తున్నారు. నేడు నేషనల్ మౌంటేన్ క్లైంబింగ్ డే నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో పలువురు ఔత్సాహికులు క్లైంబింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని పలు ప్రైవేటు సంస్థలు సైతం పర్వతారోహణకు సంబంధించి శిక్షణ అందిస్తున్నారు. కానీ క్లైంబింగ్ అనేది అత్యంత సాహసోపేతమైన ప్రయత్నమని, దీని కోసం జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న కేంద్రాల్లోనే శిక్షణ పొందడం అవసరమని నిపుణులు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఈ శిక్షణకు నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ (ఉత్తర్ కాశీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, అటల్‌బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనిరింగ్ (హిమాచల్ ప్రదేశ్), హిమాలయన్ మౌంటేనిరింగ్ ఇన్స్టిట్యూట్ (డార్జిలింగ్) వంటి కేంద్రాలు ప్రధానమైనవని పర్వతారోహకులు వెల్లడిస్తున్నారు. ఈ శిఖరాలను చేరడం అంత సులువు కాదు, సరైన శిక్షణ లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తున్నారు. ట్రెక్కింగ్, క్లైంబింగ్ ఒకటి కాదు.. వీటి మధ్య ఎంతో వ్యత్యాసముందని నిపుణుల సూచన.ప్రాణాలతో చెలగాటం.. పర్వతారోహణం అంటే ప్రకృతితో మమేకమైతూ.. అక్కడి విపత్కర పరిస్థితులకు మన దేహాన్ని అనువుగా మార్చుకుంటూ లక్ష్యాన్ని చేరడం. దీనికి అత్యంత కఠినమైన శిక్షణ అవసరం. నేను ఎన్సీసీ నుంచి క్లైంబింగ్‌కు ఎంపికై ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనింగ్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ వల్లే ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఐదింటిని అధిరోహించాను. పర్వతారోహణం అంత సులువు కాదు.. ప్రాణాలతో చెలగాటం. ఎంతో మానసిక ధృఢత్వం అవసరం. 2019లో నేను క్లైంబింగ్ చేస్తున్న సమయంలో ఐదుగురితో ఉన్న బృందంలో ఇద్దరు చనిపోవడం చూశాను. ఏడాది ఆలస్యమైనా పర్వాలేదు.. కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే శిక్షణ తీసుకోవాలి. క్లైంబింగ్లో ఏ దిశలో, ఎంత కోణంలో, అనువైన ఫిట్నెస్తో ప్రయాణించాలి తదితర అంశాల్లో ప్రామాణికమైన శిక్షణ అవసరం. అంతేగాకుండా ఇదో ప్యాషన్‌గా మారి క్లైంబింగ్ కోసం వచ్చి హిమాలయాల వంటి ప్రదేశాలను ప్లాస్టిక్‌తో నింపేస్తున్నారు. అనవసర చెత్తతో ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు. విశిష్టమైన కేంద్రాల్లో ఆర్మీ అధికారులు వీటన్నింటిపైన బేసిక్, అడ్వాన్స్డ్, అడ్వెంచరస్ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తారు. – అంగోత్ తుకారాం. (దక్షిణాది నుంచి మౌంట్ ఎవరెస్టు అధిరోహించిన మొదటి పిన్న వయసు్కడు.) -
ఎవరెస్ట్ కీ బేటీ
కుమార్తెను ప్రోత్సహించడానికి తండ్రి ఎవరెస్ట్‌లా నిలబడితే ఏ కుమారై్తనా ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి వెనుకాడదు. ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యతన తండ్రితో కలిసి తొమ్మిదో ఏటనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తాకగలిగింది. ఇప్పుడు తండ్రిని తోడు చేసుకుని ఎవరెస్ట్‌నే అధిరోహించింది. ఎవరెస్ట్‌ను ఎక్కిన బాలికలలో ఈమెది రెండో చిన్న వయసు. కామ్య సాహసయాత్ర విశేషాలు.కొన్ని విజయాలు పుట్టుకతోనే నిర్థారితమవుతాయి. ముంబైలోని నేవీ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ తాజా ఘన విజయం చూస్తే ఆ మాటే అనాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించిందామె. మే 20న ఎవరెస్ట్ అధిరోహణతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన రెండవ చిన్న వయసు మౌంటెనీర్గా, మన దేశం నుంచైతే మొట్ట మొదటి చిన్న వయసు మౌంటనీర్‌గా రికార్డ్ సృష్టించింది. దీని వెనుక కామ్య తండ్రి కార్తికేయన్ ఉన్నాడు. తల్లి లావణ్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఊహ తెలిసిన వెంటనే కనిపించిన సహ్యాద్రి పర్వతాలున్నాయి.మూడేళ్ల వయసు నుంచేకావ్య తండ్రి కార్తికేయన్ నేవీలో ఆఫీసర్. అతని ΄ోస్టింగ్ లోనావాలాలో ఉండగా కావ్యాకు మూడేళ్లు. వీకెండ్స్‌లో ఆమె తల్లిదండ్రులిద్దరూ సహ్యాద్రి పర్వతాల్లో విహారానికి కావ్యను తీసుకెళ్లేవారు. ఐదారేళ్లు వచ్చేసరికి సహ్యాద్రిలో ఆమె కాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రకృతి కామ్యను ఆకర్షించింది. పర్వతాలు హద్దుల్లేని ప్రయాణం చేయమని స్ఫూర్తినిచ్చాయి. కామ్యలోని చురుకుదనాన్ని చూసి పర్వతారోహణలో ఆమెను ప్రోత్సహించాలని కార్తికేయన్ నిశ్చయించుకున్నాడు.మొదటి లిట్మస్ టెస్ట్కామ్యకు 9 ఏళ్ల వయసు ఉండగా కార్తికేయన్ ఆమెను పర్వతారోహణలో నిలదొక్కుకోగలదో లేదో పరీక్షించడానికి లదాఖ్ తీసుకెళ్లాడు. అక్కడి మౌంట్ స్టాక్ కంగ్రీని 6000 అడుగుల ఎత్తు మేర ఆమె అధిరోహించింది. ప్రతికూల వాతావరణంలో ఆ వయసులో ఆమె చేసిన అధిరోహణ కార్తికేయన్‌కు నమ్మకమిచ్చింది. దాంతో తన కూతురు చిన్న వయసులోనే అన్ని ఖండాల్లోని పర్వతాలు అధిరోహించాలని అతడుప్రోత్సహించాడు. కామ్య ఆ సవాలును స్వీకరించింది. అలా మొదలైంది వారి ‘సాహస్’ యాత్ర.7 ఖండాల సాహస్కామ్య ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ అధిరోహించాలని నిశ్చయించుకుంది. ఆ యాత్రకు ‘సాహస్’ అని పేరు పెట్టుకుంది. ‘అయితే అది అంత సులువైన పని కాదు. మానసికంగా శారీరకంగా వైద్యానికి స్పందించే విధంగా మన శరీరం మనసు ఉండాలి. అందుకని నేను రోజుకు ఆరు గంటలు సైక్లింగ్, రన్నింగ్ చేసేదాన్ని’ అని తెలిపింది కామ్య. తన సాహస యాత్ర మొదలెట్టే ముందు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎం.ఎస్. కోలిని కలిస్తే ‘పర్వతాలు ఎన్నో కథలను నీకు ఇస్తాయి. అవి జీవితాంతం గొప్పగా నీతో మిగులుతాయి. గో అహేడ్’ అని ఆశీర్వదించాడు. కామ్య ఆగలేదు. తండ్రితో పాటు 2017లో కిలిమంజారో (ఆఫ్రికా), ఆ తర్వాతి సంవత్సరం మౌంట్ ఎల్బ్రుస్ (యూరప్), ఆ తర్వాత మౌంట్ కోసియుస్కొ (ఆస్ట్రేలియా), మౌంట్ అకొంకగువా (సౌత్ అమెరికా), మౌంట్ డెనాలి (నార్త్ అమెరికా) అధిరోహించింది. మే 20న మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) అధిరోహించడంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ ఒక్కటే చేరడం మిగిలింది.ఎవరెస్ట్ అధిరోహణమే 20న ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరడానికి ఏప్రిల్ 6 నుంచి కామ్య, ఆమె తండ్రి కార్తికేయన్ ప్రయాణం మొదలైంది. అధిరోహించేది ఎవరెస్ట్ కనుక ట్రైనింగ్, షాపింగ్, ΄్యాకింగ్, ట్రావెల్ పకడ్బందీగా ΄్లాన్ చేసుకున్నారు. మొదట ఖట్మాండు చేరుకుని అక్కడి నుంచి విమానం ద్వారా లుక్లా ఎయిర్΄ోర్ట్కు చేరుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఇది మొదటి మజిలీ. అక్కడి నుంచి ఆరోహణ ్రపారంభించి ఫాక్డింగ్ (2610 మీటర్లు) నుంచి నామ్చే బజార్ (3440 మీటర్లు) చేరుకున్నారు. అక్కడ విరామం తీసుకున్నాక టెంగ్బోచె (3860 మీటర్లు)కు ట్రెక్ సాగింది. ఆ తర్వాత లొబొచె (4940 మీటర్లు) చేరుకుని ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆక్సిజన్ పరికరాలు ఉపయోగిస్తూ పర్వతారోహణ ఎలా చేయాలో, పైకి కొనసాగే సమయంలో సేఫ్టీ పరికరాలు ఎలా ఉపయోగించాలో ట్రయినింగ్ తీసుకున్నారు. శిఖరాగ్రం చేరుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేక΄ోవడంతో మే 15 వరకూ బేస్ క్యాంప్‌లోనే ఉండాల్సి వచ్చింది. మే 15న బయలుదేరి మే 20 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కామ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. 8, 849 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ శిఖరంపైన తన తండ్రితో పాటు నిలబడి కామ్య తన విజయాన్ని ఆస్వాదించింది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది. -
ఏఎస్పీ రాధికకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: జీరో డిగ్రీ ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే అంటార్కిటికా ప్రాంతానికి వెళ్లాలని ఉందని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జి.ఆర్.రాధిక అన్నారు. ఆర్థిక సహకారం అందింతే భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేస్తానన్నారు. ఎవరెస్ట్ అధిరోహణ క్రమంలో కొన్ని కష్టాలు ఎదురైనా అందరి ప్రోత్సాహంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆదిలాబాద్ అదనపు ఎస్పీ రాధికను డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తిరిగి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబసభ్యులు, పోలీసు క్రీడావిభాగం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఏప్రిల్ 6న బయలుదేరిన రాధిక కఠ్మాండు మీదుగా తొలి బేస్ క్యాంప్‌ను ఏప్రిల్ 19న చేరుకున్నారు. అనంతరం వివిధ పర్వత అంచులను చేరుకుంటూ ఈ నెల 20న ఎవరెస్ట్‌ను అధిరోహించారు.