ముంబై : నేవి చెందిన బోటు నడిపే డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ముంబై సముద్ర తీరంలో జరిగిన పెను విషాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ముంబై సముద్ర తీరంలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ‘నీల్‌కమల్’ అనే ఫెర్రీ (పడవ) దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పాయారు.
వారిలో తన అత్త ప్రాణాలు కోల్పోయిందని గౌరవ్ గుప్తా అనే యువకుడు విచారం వ్యక్తం చేశారు. ఫెర్రీ ప్రమాదం ఘటనలో సురక్షితంగా బయటపడ్డ గౌరవ్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇండియన్ నేవీ చెప్పినట్లుగా నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగలేదని, నేవీ బోటు డ్రైవర్ అత్యుత్సాహం వల్లే భారీ ప్రాణ నష్టం సంభవించిందని వాపోయాడు.
‘‘నేను పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాకు కూరగాయాల వ్యాపారం చేస్తున్నా. గత వారం నా వివాహానానికి ముంబై నుంచి మా అత్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. వారికి ఎలిఫెంటా గుహలు చూపించేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి పడవలో బయలుదేరాము. మా అత్తతో పాటు, ఇతర ప్రయాణికులకు అదే చివరి రోజవుతుందని అనుకోలేదు.
ఎలిఫెంటా ద్వీపం వైపు వెళుతుండగా నేవీకి చెందిన స్పీడ్ బోట్ 5 నుండి 6 మంది సిబ్బందితో మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా పక్కకు వచ్చింది. ఆ సమయంలో నేవీ బోటు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు అత్యుత్సాహం ప్రదర్శించారు. బోటును అటూ ఇటూ తిప్పుతూ ఫోజులు కొట్టారు. నేవీ డ్రైవర్ చేస్తున్న విన్యాసాల్ని తోటి ప్రయాణికులు వీడియోలు కూడా తీశారు. చివరికి మా బోటును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ ఆ బోటును మా బోటుకు వైపుకు వేగంగా దూసుకొచ్చాడు. ఓవర్ టేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ స్పీడ్ బోటు.. మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో 100 మంది ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు మమ్మల్ని రక్షించాయి’’అని అన్నారు.
#MumbaiBoatAccident - Live video
"Today afternoon, an #IndianNavy craft lost control while undertaking engine trials in #Mumbai Harbour due to engine malfunction. As a result, the boat collided with a passenger #ferry which subsequently capsized (#BoatCapsized )."
"13… pic.twitter.com/9ifLLurccP— Surya Reddy (@jsuryareddy) December 18, 2024
నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం తలెత్తిందనే వాదనను గుప్తా ఖండించారు. ఫెర్రీని ఢీకొట్టడానికి ముందు నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ సంతోషంగా ఉన్నారు. తాము ప్రయాణిస్తున్న బోటు ఎదురుగా వచ్చే మా ముందు విన్యాసాలు చేశారు. నేవీ బోటులో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తితే.. అలా ప్రయాణం చేయరు కదా? అంత వేగంగా స్పీడు బోటును ఎలా నడిపారు అని ప్రశ్నించారు.
కాగా, ఫెర్రీ బోటు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొని 101 మందిని కాపాడాయి.
Comments
Please login to add a commentAdd a comment