Speed boat
-
తాజా మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
కరీంనగర్ : తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు షాకయ్యే పరిస్థితి తలెత్తింది. కరీంనగర్ మానేరు డ్యామ్‌లో వాటర్ స్కూటర్ దిగుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. అయితే లైఫ్‌జాకెట్ వేసుకోవడంతోపాటూ, అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్ స్పీడ్ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా, దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
మత్స్యకారుల మధ్య స్పీడ్ బోట్ల చిచ్చు
-
కదలని బోటు... నిలిచిన వేట
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ప్రశాంతంగా ఉండే ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం విభేదాలతో భగ్గుమంటోంది. ఇప్పటి వరకూ కలిసికట్టుగా ఉన్న బోటు యజమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్పీడ్బోట్ల యజమానులు, చిన్న మర పడవల యజమానుల మధ్య చెలరేగిన చిచ్చు ఆరడం లేదు. రోజురోజుకూ అది దావానలంలా చేపల రేవును దహించేస్తోంది. చేపల రేవులో ప్రస్తుతం ఉన్న 700 బోట్లలో సుమారుగా 50 నుంచి 60 వరకూ స్పీడ్ ఇంజిన్ బోట్లు ఉన్నాయి. అధిక సామర్థ్యంతో నడుస్తున్న ఈ బోట్ల వల్ల తక్కువ సామర్థ్యం ఉన్న బోట్లకు నష్టం వాటిల్లుతోందని, స్పీడ్‌బోట్లను నిలిపివేయాలన్న డిమాండ్ చేపల రేవులో గట్టిగా వినిపిస్తోంది. అయితే తాము ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, స్పీడ్‌బోట్లను నడిపి తీరుతామని ఆయా బోట్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దీనిపై చిన్నబోట్ల యజమానులు నిరసనలు తెలియజేసినా, సమస్య కొలిక్కి రాకపోవడంతో సోమవారం ఫిషింగ్ హార్బర్ బంద్‌ను ప్రకటించడంతో పాటు మత్స్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వీరికి సంఘీభావంగా హార్బర్లో ఉన్న మూడు ప్రధాన మర పడవల సంఘాల అధ్యక్షులు ధర్నాలో కూర్చున్నారు. బంద్‌తో చేపల వేట నిలిచిపోయింది. స్పీడ్ బోటు వెనుక దొరకని చేపలు ఈ సందర్భంగా మరబోట్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ వేటకు వెళ్లే 15 మీటర్ల పొడవున్న మరబోటుకు 102, 112 హార్స్ పవర్ ఉన్న ఇంజిన్లను వినియోగిస్తే స్పీడ్ బోట్లలో చైనాకు చెందిన 200 నుంచి 250 హార్స్ వవర్ ఇంజిన్లు వినియోగిస్తున్నారని తెలిపారు. సాధారణ బోటు గంటలో ఒక కిలోమీటరు దూరం వెళ్తే, స్పీడ్ బోట్లు గంటకు మూడు కిలోమీటర్ల దూరం వెళ్తాయని, స్పీడ్ బోటు వెళ్లిన దారిలోనే మరపడవ వెళ్తే వారికి వేటలో ఏమీ చిక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ స్పీడ్ ఇంజిన్ బోట్లను రద్దు చేశారని చెప్పారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను ప్రభుత్వం, మత్స్యశాఖ, జిల్లా అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఫిషింగ్ హార్బర్లో ఉన్న మూడు యూనియన్ల నాయకులతో పాటు చిన్నబోట్ల యజమానులు మత్స్యశాఖ అధికారులకు, ప్రభుత్వానికి వినతిపత్రాలను అందజేశారు. మరోవైపు దీనిపై తగిన నివేదిక పంపాలని మత్స్యశాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది. నిరసన కార్యక్రమంలో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్రి కొండబాబు, డాల్ఫిన్ మర పడవల సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి, మున్నం బాలాజీ, సనపల రవీంద్ర భరత్, మహా విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సంక్షేమ సమాఖ్య సమన్వయకర్త దూడ ధనరాజు, వై.శ్రీనివాసరావు, ప్రతినిధులు తోట సత్తిరాజు, మైలపల్లి లక్ష్మణరావు, దాసరి అప్పారావు, పీరుపల్లి ధన, అధిక సంఖ్యలో చిన్నబోటు యజమానులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి కార్యాచరణ ఫిషింగ్ హార్బర్లో ఉన్న స్పీడ్ బోట్లను నిలిపివేయాలని ప్రభుత్వానికి విన్నవించామని యూనియన్ల నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్లను వినియోగించాలని ఆయా బోట్ల యజమానులకు తెలియజేశామని తెలిపారు. ఎవరికి వారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ నెల 15వ తేదీకి కార్యాచరణ రూపొందించి చిన్న బోట్ల యజమానులకు అన్యాయం జరగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఆలోచింపజేసిన ఫ్లెక్సీ వ్యవసాయదారుడు పంటకు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎలా ఆత్మహత్య చేసుకుంటున్నాడో అదేవిధంగా స్పీడ్ ఇంజిన్ బోట్ల వల్ల చిన్న బోట్ల యజమానులు కూడా ఆత్మహత్య చేసుకునే పరి స్థితి ఏర్పడుతుందంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని ఆలోచింపచేసింది. బోటు మాస్టర్ పోల్‌కు ఉరివేసుకుని వేలాడేలా ఉన్న ఫ్లెక్సీలను ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేశారు. నిలిచిన రూ.6 కోట్ల వ్యాపారం ఫిషింగ్ హార్బర్లో బంద్ ప్రకటించడంతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే నిలిచిపోయాయి. వేటకు వెళ్లిన బోట్లు కొన్ని తిరిగివచ్చినా అందులోని సరకును దించలేదు. హార్బర్లో ఉన్న దుకాణాలు, ఐస్ ఫ్యాక్టరీలు మూసేశారు. ఎండుచేపలు, పచ్చిచేపల వ్యాపారం నిలిచిపోయింది. రొయ్యల ఎగుమతి కేంద్రం మూతపడింది. మొత్తం మీద బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. సుమారుగా రూ.6 కోట్ల వ్యాపారం నిలిచిపోయినట్టు సమాచారం. -
విశాఖలో మత్స్యకారుల ఫిషింగ్ హార్బర్ బంద్
-
‘తాటిపూడి’లో లాహిరి.. లాహిరి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు తాగునీటిని అందిస్తున్న తాటిపూడి జలాశయంలో స్పీడ్ బోట్లు షికారు చేయనున్నాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ రిజర్వాయరు పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ జలాశయంలో పర్యాటకుల విహారానికి కొన్నేళ్లుగా స్థానికులు 20 సీట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటారు బోట్లను నడుపుతున్నారు. వాటిని కొనుగోలు చేసి దాదాపు 15 ఏళ్లు దాటింది. అంతగా కండిషన్లో లేకపోయినప్పటికీ ఏదోలా వాటిని నడుపుతూ వచ్చారు. గత ఏడాది నవంబరులో కృష్ణా జిల్లా పవిత్ర సంగమంలో బోటు బోల్తా దుర్ఘటనలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో నదులు, జలాశయాల్లో కాలం చెల్లిన, కండిషన్ తప్పిన బోట్లను నిలుపుదల చేశారు. అందులోభాగంగానే తాటిపూడి రిజర్వాయరులో తిప్పుతున్న పాత బోట్లను కూడా ఆపేశారు. దాదాపు నాలుగు నెలలుగా అక్కడ బోటు షికారు జరగడం లేదు. అరకు వెళ్లే, అటు నుంచి వచ్చే పర్యాటకులు ఈ రిజర్వాయరుకు వెళ్లి బోటులో ఎంజాయ్ చేస్తుంటారు. వారాంతపు రోజుల్లో (శని, ఆదివారాల్లో) సగటున 500 నుంచి 600 మంది వరకు పర్యాటకులు తాటిపూడి జలాశయంలో విహారానికి వెళ్లేవారు. తాటిపూడిలో బోటు షికారు నిలిచిపోవడంతో అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అక్కడ మూడు నాన్ ఏసీ, రెండు ఏసీ కాటేజీలు ఉన్నాయి. బోటు రైడింగ్ లేకపోవడంతో ఈ కాటేజీల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఫలితంగా పర్యాటకశాఖకు ఆదాయం క్షీణించింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్తగా స్పీడ్ బోట్లను కొనుగోలు చేసి బోటు రైడింగ్‌ను పునరుద్ధరించాలని పర్యాటకశాఖ అధికారులు నిర్ణయించారు. ఆరు సీట్ల సామర్థ్యం ఉన్న స్పీడ్ బోట్లు రెండు, 20 సీట్ల కెపాసిటీ గల ఒక బోటును కొనుగోలు చేయనున్నారు. ఆరు సీట్ల బోటు రూ.15 లక్షలు, 20 సీట్ల బోటుకు రూ.20 లక్షల చొప్పున వెచ్చించనున్నట్టు పర్యాటకశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. దాదాపు అరగంట సేపు లాహిరి లాహరికి ఒక్కొక్కరి నుంచి టిక్కెట్టు ధర రూ.50 వసూలు చేయనున్నారు. స్పీడ్ బోట్లు అందుబాటులోకి రావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. మోటారు బోటుకంటే స్పీడ్ బోటులో రైడింగ్ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మరో రూ.50 లక్షలతో పర్యాటక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటకశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
లాహిరి లాహిరి లాహిరిలో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం సరికొత్త స్పీడు బోటు సిద్ధమైంది. సాగరంలోకి రయ్‌ను దూసుకుపోయే ఈ బోటు నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటక శాఖ చాన్నాళ్లుగా 40 మంది కూర్చునే వీలున్న ‘స్వర్ణవిహారి’ పాత బోటును నడిపేది. గత నవంబర్ 12న విజయవాడ వద్ద కృష్ణా నదిలో జరిగిన పర్యాటకశాఖ బోటు బోల్తాపడిన ప్రమాదంలో 25 మందికి పైగా మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందిన పర్యాటకశాఖ అధికారులు అప్పటికే అంతగా ఫిట్నెస్ లేని స్వర్ణ విహారిని నిలిపివేశారు. దీంతో విశాఖ ఆర్కే బీచ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు బోటు షికారు చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుషికొండలో పర్యాటకశాఖ నడుపుతున్న నాలుగు సీట్ల స్పీడ్ బోటు మాత్రమే పర్యాటకులకు అరకొరగా సరదా తీరుస్తోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ విహారికి మళ్లీ మెరుగులు దిద్ది పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో పర్యాటకశాఖ అధికారులు 10 సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త స్పీడు బోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బోటును ఫిషింగ్ హార్బర్లోని 11వ నంబరు జెట్టీ నుంచి నడపనున్నారు. ఇందులో ఇద్దరు డైవర్లు (గజ ఈతగాళ్లు–వీరే బోటును కూడా నడుపుతారు) కాగా మిగిలిన వారు పర్యాటకులుంటారు. ఈ బోటు 11వ నంబరు జెట్టీ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలోకి తీసుకెళ్లి తీసుకొస్తారు. టిక్కెట్టు ధర రూ.250.. ఒక్కొక్కరికి రూ.250 టిక్కెట్టు ధర నిర్ణయించారు. రుషికొండలో నడుస్తున్న స్పీడ్ బోటులో షికారు చేసే వారికి ఒక్కొక్కరికి రూ.300 టిక్కెట్టు వసూలు చేస్తున్నారు. ఎక్కువ సామర్థ్యం ఉండడం, డీజిల్ నడవడం వల్ల స్వర్ణ విహారి బోటులో టిక్కెట్టు ధర రూ.60లే ఉండేది. కానీ ఈ స్పీడు బోటు పెట్రోల్‌తో నడిచేది కావడం, తక్కువ మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో ఈ బోటు షికారుకు రూ.250 టిక్కెట్టుగా నిర్ణయించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ స్పీడు బోటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపనున్నారు. ఈ బోటు సర్వీసును ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
స్పీడ్ బోట్లు పాడుబెట్టి.. బ్యాటరీ కార్ తెచ్చిపెట్టి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులను ఆకట్టుకో డానికి రకరకాల చర్యలు తీసుకోవటం అవస రం. అందులో భాగంగానే గతంలో స్పీడ్ బోట్ల ను కొనుగోలు చేసింది పర్యాటక శాఖ. కానీ చిన్నపాటి మరమ్మతుల పేరుతో వాటిని పక్కన పడేసింది. మరమ్మతు చేయగలిగే పరి జ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఏడా దిగా అవి పాడుబడిపోతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో బోట్ల అవసరం చాలా ఉంది. స్పీడ్ బోట్ల కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పర్యాటక శాఖాధికారులు మాత్రం బోట్లను పట్టించుకోవడం లేదు. లుంబినీ పార్క్ వద్ద అవసరముందా? స్పీడ్ బోట్ల మరమ్మతును పక్కనబెట్టిన పర్యాటక శాఖ.. తాజాగా బ్యాటరీతో నడిచే వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలుత కొన్ని వాహనాలను ఆర్డర్ ఇవ్వగా.. తొలివిడత రెండొచ్చాయి. వాటిలో ఓ వాహనాన్ని పూర్వపు వరంగల్ జిల్లాలోని లక్నవరం సరస్సు వద్ద అందుబాటులో ఉంచనున్నారు. మరొకటి లుంబినీ పార్కులో పర్యాటకుల కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. అయితే పార్కులో అవసరం లేకున్నా ఓ వాహనాన్ని అందుబాటులో ఉంచా లనుకోవడం విస్మయం కలిగిస్తోంది. తరచూ వచ్చే వీఐపీల కోసం దాన్ని వినియోగించనున్నా రని సిబ్బంది చెబుతున్నారు. వీఐపీల కోసమా.. పర్యాటకుల కోసమా.. బ్యాటరీ వాహనాల అవసరం ఉన్నా వాటిని ఎక్కడ వినియోగించాలనే నిర్ణయమూ అంతే అవసరం. పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండేందుకు, పర్యాటకులు నడవాల్సిన అవసరం ఉన్న చోట ఈ వాహనాల అవసరం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వాటిని వినియోగిస్తే పర్యాటకులూ హర్షిస్తారు. లక్నవరం ప్రధాన రోడ్డు నుంచి సరస్సు వరకు ఎక్కవ దూరం ఉంటుంది. పర్యావరణానికి ప్రాధాన్యమున్న ఆ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు బ్యాటరీ వాహనాల అవసరం ఉంది. కానీ తక్కువ దూరం ఉన్న లుంబినీ పార్కులో వాటి అవసరం లేదు. కానీ వీఐపీల కోసం ఖరీదైన బ్యాటరీ వాహనాన్ని వృథా చేయబోతున్నారని సమాచారం. -
నీటిలో చేపలా..
చేపలా సముద్రంలో ఈదులాడాలని ఉందా? డాల్ఫిన్‌లా ఇలా దూకాలని ఉందా? మీలాంటి వారి కోసమే ఈ మర చేప. చూడ్డానికి షార్క్‌లా కనిపిస్తున్నా వాస్తవానికిదో స్పీడ్ బోట్. పాత యుద్ధవిమానాల తాలూకు పరికరాలతో దీన్ని తయారుచేశారు. సీబ్రీచర్గా పిలుస్తున్న దీన్ని ఇన్నెస్పేస్ అనే సంస్థ తయారుచేసింది. 260 హార్స్పవర్ ఇంజిన్‌తో గంటకు 50 మైళ్ల వేగంతో దూసుకుపోయే ఈ స్పీడ్ బోట్ ధర రూ.41 లక్షలు. దీన్ని సీబ్రీచర్.కామ్ అనే ఆన్లైన్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.