
కరీంనగర్ : తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు షాకయ్యే పరిస్థితి తలెత్తింది. కరీంనగర్ మానేరు డ్యామ్‌లో వాటర్ స్కూటర్ దిగుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు.
అయితే లైఫ్‌జాకెట్ వేసుకోవడంతోపాటూ, అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్ స్పీడ్ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా, దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment