kamya karthikeyan
-
ఎవరెస్ట్ కీ బేటీ
కుమార్తెను ప్రోత్సహించడానికి తండ్రి ఎవరెస్ట్‌లా నిలబడితే ఏ కుమారై్తనా ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి వెనుకాడదు. ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యతన తండ్రితో కలిసి తొమ్మిదో ఏటనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తాకగలిగింది. ఇప్పుడు తండ్రిని తోడు చేసుకుని ఎవరెస్ట్‌నే అధిరోహించింది. ఎవరెస్ట్‌ను ఎక్కిన బాలికలలో ఈమెది రెండో చిన్న వయసు. కామ్య సాహసయాత్ర విశేషాలు.కొన్ని విజయాలు పుట్టుకతోనే నిర్థారితమవుతాయి. ముంబైలోని నేవీ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ తాజా ఘన విజయం చూస్తే ఆ మాటే అనాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించిందామె. మే 20న ఎవరెస్ట్ అధిరోహణతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన రెండవ చిన్న వయసు మౌంటెనీర్గా, మన దేశం నుంచైతే మొట్ట మొదటి చిన్న వయసు మౌంటనీర్‌గా రికార్డ్ సృష్టించింది. దీని వెనుక కామ్య తండ్రి కార్తికేయన్ ఉన్నాడు. తల్లి లావణ్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఊహ తెలిసిన వెంటనే కనిపించిన సహ్యాద్రి పర్వతాలున్నాయి.మూడేళ్ల వయసు నుంచేకావ్య తండ్రి కార్తికేయన్ నేవీలో ఆఫీసర్. అతని ΄ోస్టింగ్ లోనావాలాలో ఉండగా కావ్యాకు మూడేళ్లు. వీకెండ్స్‌లో ఆమె తల్లిదండ్రులిద్దరూ సహ్యాద్రి పర్వతాల్లో విహారానికి కావ్యను తీసుకెళ్లేవారు. ఐదారేళ్లు వచ్చేసరికి సహ్యాద్రిలో ఆమె కాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రకృతి కామ్యను ఆకర్షించింది. పర్వతాలు హద్దుల్లేని ప్రయాణం చేయమని స్ఫూర్తినిచ్చాయి. కామ్యలోని చురుకుదనాన్ని చూసి పర్వతారోహణలో ఆమెను ప్రోత్సహించాలని కార్తికేయన్ నిశ్చయించుకున్నాడు.మొదటి లిట్మస్ టెస్ట్కామ్యకు 9 ఏళ్ల వయసు ఉండగా కార్తికేయన్ ఆమెను పర్వతారోహణలో నిలదొక్కుకోగలదో లేదో పరీక్షించడానికి లదాఖ్ తీసుకెళ్లాడు. అక్కడి మౌంట్ స్టాక్ కంగ్రీని 6000 అడుగుల ఎత్తు మేర ఆమె అధిరోహించింది. ప్రతికూల వాతావరణంలో ఆ వయసులో ఆమె చేసిన అధిరోహణ కార్తికేయన్‌కు నమ్మకమిచ్చింది. దాంతో తన కూతురు చిన్న వయసులోనే అన్ని ఖండాల్లోని పర్వతాలు అధిరోహించాలని అతడుప్రోత్సహించాడు. కామ్య ఆ సవాలును స్వీకరించింది. అలా మొదలైంది వారి ‘సాహస్’ యాత్ర.7 ఖండాల సాహస్కామ్య ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ అధిరోహించాలని నిశ్చయించుకుంది. ఆ యాత్రకు ‘సాహస్’ అని పేరు పెట్టుకుంది. ‘అయితే అది అంత సులువైన పని కాదు. మానసికంగా శారీరకంగా వైద్యానికి స్పందించే విధంగా మన శరీరం మనసు ఉండాలి. అందుకని నేను రోజుకు ఆరు గంటలు సైక్లింగ్, రన్నింగ్ చేసేదాన్ని’ అని తెలిపింది కామ్య. తన సాహస యాత్ర మొదలెట్టే ముందు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎం.ఎస్. కోలిని కలిస్తే ‘పర్వతాలు ఎన్నో కథలను నీకు ఇస్తాయి. అవి జీవితాంతం గొప్పగా నీతో మిగులుతాయి. గో అహేడ్’ అని ఆశీర్వదించాడు. కామ్య ఆగలేదు. తండ్రితో పాటు 2017లో కిలిమంజారో (ఆఫ్రికా), ఆ తర్వాతి సంవత్సరం మౌంట్ ఎల్బ్రుస్ (యూరప్), ఆ తర్వాత మౌంట్ కోసియుస్కొ (ఆస్ట్రేలియా), మౌంట్ అకొంకగువా (సౌత్ అమెరికా), మౌంట్ డెనాలి (నార్త్ అమెరికా) అధిరోహించింది. మే 20న మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) అధిరోహించడంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ ఒక్కటే చేరడం మిగిలింది.ఎవరెస్ట్ అధిరోహణమే 20న ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరడానికి ఏప్రిల్ 6 నుంచి కామ్య, ఆమె తండ్రి కార్తికేయన్ ప్రయాణం మొదలైంది. అధిరోహించేది ఎవరెస్ట్ కనుక ట్రైనింగ్, షాపింగ్, ΄్యాకింగ్, ట్రావెల్ పకడ్బందీగా ΄్లాన్ చేసుకున్నారు. మొదట ఖట్మాండు చేరుకుని అక్కడి నుంచి విమానం ద్వారా లుక్లా ఎయిర్΄ోర్ట్కు చేరుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఇది మొదటి మజిలీ. అక్కడి నుంచి ఆరోహణ ్రపారంభించి ఫాక్డింగ్ (2610 మీటర్లు) నుంచి నామ్చే బజార్ (3440 మీటర్లు) చేరుకున్నారు. అక్కడ విరామం తీసుకున్నాక టెంగ్బోచె (3860 మీటర్లు)కు ట్రెక్ సాగింది. ఆ తర్వాత లొబొచె (4940 మీటర్లు) చేరుకుని ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆక్సిజన్ పరికరాలు ఉపయోగిస్తూ పర్వతారోహణ ఎలా చేయాలో, పైకి కొనసాగే సమయంలో సేఫ్టీ పరికరాలు ఎలా ఉపయోగించాలో ట్రయినింగ్ తీసుకున్నారు. శిఖరాగ్రం చేరుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేక΄ోవడంతో మే 15 వరకూ బేస్ క్యాంప్‌లోనే ఉండాల్సి వచ్చింది. మే 15న బయలుదేరి మే 20 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కామ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. 8, 849 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ శిఖరంపైన తన తండ్రితో పాటు నిలబడి కామ్య తన విజయాన్ని ఆస్వాదించింది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది. -
శెభాష్ కామ్య..!
జంషెడ్పూర్: కామ్య కార్తికేయన్. 16 ఏళ్లు. చదివేది ప్లస్‌టూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి చిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా కూడా నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్(టీఎస్‌ఏఎఫ్) గురువారం తెలిపింది. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్య మరో అడుగు దూరంలోనే ఉన్నట్లు టీఎస్‌ఏఎఫ్ చైర్మన్ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసిందని, సాహసికులకు ఆమె ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థే కామ్యకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఏప్రిల్ ఆరో తేదీన తన బృందంతోపాటు కఠ్మాండుకు చేరుకున్న కామ్య..పూర్తిస్థాయి సన్నద్ధతతో మే 16వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తండ్రి కార్తికేయన్‌తోపాటు సాహసయాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20వ తేదీన వేకువజామున 8,848 మీటర్ల ఎత్తయిన శిఖరంపైకి చేరుకుందని టీఎస్‌ఏఎఫ్ వివరించింది. తాజా విజయంతో ఆరు ఘనతలను సాధించిన కామ్య.. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలన్న ధ్యేయానికి కేవలం అడుగు దూరంలో నిలిచిందని వెస్టర్న్ నేవీ కమాండ్ ‘ఎక్స్’లో పేర్కొంది. ఏడో లక్ష్యమైన అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్‌ను వచ్చే డిసెంబర్లో అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామ్య.. ఈ అరుదైన ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటల్లో నిలవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.నేవీ కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ప్లస్‌టూ చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. ఏడో ఏటనే, 2015లో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశిల పర్వతాన్ని అధిరోహించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016లో 13,500 అడుగుల ఎత్తున్న మరింత కఠినమైన హరి కీ దున్ను, కేదార్నాథ్ శిఖరాలను అవలీలగా ఎక్కింది. అదేవిధంగా, 16,400 అడుగుల ఎత్తులో రూప్‌కుండ్ సరస్సుకు చేరుకుంది. అసా ధారణ విజయాలను నమోదు చేసిన బాలల కిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పుర స్కారం కూడా కామ్య అందుకుంది. 2017లో నేపాల్‌లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.ఎవరెస్ట్ కీ బేటీ– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో -
Visakhapatnam: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!
‘మహిళలు, ఆడపిల్లలు అవరోధాల్ని అధిగమించి.. ఖండాతరాల్లో ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఇలాంటి వారందరికీ విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఇది ఎంతో గర్వకారణం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.’ – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ఈ ఒక్క ప్రశంస చాలు.. ఆమె సాధించిన ఘనత గురించి చెప్పుకోవడానికి.! బుడి బుడి అడుగులు వేసే వయసులోనే.. కొండలెక్కడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన సమయంలో పర్వతారోహణ చేపట్టింది. అలా మొదలైన ప్రయాణం.. రికార్డులు తిరగరాసేంత వరకు చేరింది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్ట్, పదేళ్లకే కిలిమంజారో.. ఇప్పుడు సాహస్.. ఇలా ఆ బాలిక సంకల్పబలం ముందు శిఖరం సైతం సాహో అంటోంది. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ.. ఇప్పటికే ఐదు అతి ఎత్తయిన శిఖరాగ్రాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది. వచ్చే నెలలో ఉత్తర అమెరికాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆ సాహసి పేరే కామ్య కార్తికేయన్. – సాక్షి, విశాఖపట్నం ఐదు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలు ఒక్కో రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్న కామ్య.. 2017 మే 16 నుంచి రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. అప్పుడే ‘సాహస్’యాత్రకు బీజం పడింది. ఏడు ఖండాల్లోని అతి ఎత్తయి న పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పం కామ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనుకున్నదే తడవుగా.. ఎవరెస్ట్ ఎక్కిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించింది. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా మరో రికార్డు సాధించింది. పదేళ్ల వయసులో స్టాక్ కాంగ్రీ పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఖండంలో 7,310 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను 2019లో పూర్తి చేసింది. తల్లి లావణ్యతో కలిసి వెళ్లిన కామ్య.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. మౌంట్ కోసియాజ్కోను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. అనంతరం దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అవలీలగా అధిరోహించేసింది. రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఆ అలవాటే.. అవార్డులు తెచ్చిపెడుతోంది! విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయన్ స్పోర్ట్స్ పర్సన్‌గా నేవీలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది కామ్య కార్తికేయన్. కామ్యకు నడక రాని సమయంలో తండ్రి కార్తికేయన్, తల్లి లావణ్య ఆ చిన్నారిని ఎత్తుకొని ట్రెక్కింగ్‌కు, వాకింగ్‌కు వెళ్లేవారు. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. ఆ అలవాటే.. కామ్యకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. అలా నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. మూడేళ్ల ప్రాయంలో ముంబయిలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గడ్ పర్వతాలను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో హిమాలయ పర్వత శ్రేణిలో 12 వేల అడుగుల చంద్రశీల, 2016లో 13,500 అడుగుల హర్‌కిదున్, 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ, 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు పర్వతారోహణ పూర్తి చేసింది. తొమ్మిదేళ్ల వయసులోనే హిమాలయాల్లోని రూప్‌కుండ్ మంచు సరస్సును అధిరోహించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు అర్హత సాధించింది. ప్రశంసించిన మోదీ మన్‌కీ బాత్‌లో విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆసియా ఆవల ఉన్న దేశాల్లో 7 వేల మీటర్ల అత్యంత ఎత్తయిన శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కామ్య ధైర్యం అందరిలోనూ స్ఫూర్తినింపిందంటూ కొనియాడారు. ‘మిషన్ సాహస్’లో భాగంగా పర్వతారోహణ చేస్తున్న కామ్య వివిధ దేశాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు. ఈ మిషన్‌లో కామ్య సఫలీకృతమై. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శక్తి సామర్థ్యాల విషయంలో భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సాహస యాత్రలకు గుర్తింపుగా ఇటీవలే పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా కామ్య అందుకుంది. ఉత్తర అమెరికా వైపు అడుగులు.. విశాఖ నేవీ స్కూల్లో చదువుతున్న కామ్య కార్తికేయన్.. ఆరో ఖండంలోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. సాహస్ యాత్రలో ఉత్తర అమెరికాలోని అలస్కాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేయాలని భావిస్తోంది. జూన్ 22వ తేదీన ఈ యాత్రను ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో కామ్య ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. డెనాలీ పర్వత శిఖరం 20,310 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని అధిరోహించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తే.. మిగిలినది అంటార్కిటికాలో అతి ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సెన్ మాసిఫ్. ఇది అంటార్కిటికా మంచు పర్వత శ్రేణుల్లో 16,050 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని కూడా అధిరోహిస్తే.. కామ్య కార్తికేయన్ సాహస్ యాత్ర పూర్తవుతుంది. ఏడు ఖండాల్లోనూ దేశ కీర్తిని పెంచడమే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య నా వెన్నంటే ఉంటుంది. అందుకే.. అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. జూన్‌లో ఉత్తర అమెరికా శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. అంటార్కిటికాలోని చివరి పర్వతాన్ని ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. కష్టమైనా ప్రతి ఒక్క విజయాన్ని సాధించే తీరుతాను. –కామ్య కార్తికేయన్, పర్వతారోహణ చేస్తున్న బాలిక ఇకపై వేసే ప్రతి అడుగూ ఒక సవాలే.. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. అలా అలవాటు చేసుకున్న కామ్య.. శారీరకంగానూ మానసికంగానూ పర్వతారోహణకు సిద్ధపడుతూ వచ్చింది. ఇప్పటి వరకూ ఐదు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. అయితే.. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. అంతే కాదు.. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. ఈ రెండు శిఖరాలను అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. – లావణ్య కార్తికేయన్, కామ్య తల్లి -
అమ్మ శిఖరం.. పాప రికార్డుల కొండ
ఒకరు చేయి పట్టుకొని నడక నేర్పితే.. ఆ నడక నుంచే నడత నేర్చుకొని ప్రపంచాన్ని చుట్టేస్తోందా చిన్నారి.తల్లిదండ్రుల సాహస యాత్రలను చిన్నతనం నుంచి చూస్తూ.. తానూ ఆ బాటలో నడవాలని నిశ్చయించుకున్న కామ్య.. ఇప్పుడు తన ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెబుతోంది. సాహసాలకు చిరునామాగా మారినపదకొండేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్, ఆమె తల్లి లావణ్య కార్తికేయన్ కథను ఓసారి చదివేద్దామా.. విశాఖ సిటీ: మూడంతస్తుల మెట్లు ఎక్కితే అలిసిపోతారు కొందరు..ఊరిలో ఉన్న చిన్న కొండపైకి వెళ్లేందుకు సాహసించమంటే.. ఉలిక్కిపడతారు ఇంకొందరు.కానీ.. మా అమ్మాయి కాళ్లు పారాచ్యూట్ల్లా మారిపోతాయి. శిఖరం చూస్తే చాలు.. చకచకా ఎక్కేస్తూ.. అగ్రానికి చేరుకొని రికార్డులు సొంతం చేసుకుంటుంది.. మా కామ్య బంగారు కొండ.అంటూ మురిసిపోయింది లావణ్య కార్తికేయన్. అదేం కాదు..అమ్మే నాకు స్ఫూర్తి.. అమ్మ అడుగులే.. నాకు గూగుల్ మ్యాప్.అమ్మ మాటలే.. నాకు ఎనర్జీ డ్రింక్. అమ్మ తోడుగా ఉంటే.. ఏడు ఖండాలూ ఎక్కేస్తాననే విశ్వాసం ఉంది. అందుకే మా అమ్మ ఓ శిఖరం... అంటూ ముద్దు ముద్దుగా చెబుతోంది కామ్య కార్తికేయన్.తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా పనిచేస్తున్న ఎస్ కార్తికేయన్ భార్య లావణ్య కార్తికేయన్ విశాఖ నేవీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. సింథియాలోని నేవల్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. కార్తికేయన్, లావణ్యలు రోజూ.. వ్యాయామం చేయడంతో పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. పర్వతారోహణ చేస్తున్న సమయంలో తమ చిన్నారి కామ్య కార్తికేయన్‌ను కూడా తీసుకెళ్లేవారు. ఆ చిన్నారిని ఎత్తుకునే.. ట్రెక్కింగ్ చేసేవారు. ఆ సాహసాల్ని చూసి వంటబట్టించుకుందో ఏమో.. క్రమంగా బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. కామ్య పట్టుదలను చూసి.. తల్లి లావణ్య మురిసిపోతూ.. ట్రెక్ గురువుగా మారిపోయారు. నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో తన కుమార్తె కామ్యనూ భాగస్వామ్యం చేస్తూ సాహస యాత్రల వైపు అడుగులు వేశారు. ఏడు ఖండాలనూ చుట్టి వచ్చేలా.. ఆసియా, ఆఫ్రికాలో త్రివర్ణ పతాకాన్ని తన రికార్డులతో రెపరెపలాడించిన కామ్య.. అక్టోబర్ 12న తల్లి లావణ్యతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఆస్ట్రేలియా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను అధిరోహించేందుకు వెళ్లిన కామ్య.. తన పర్వతారోహణనను 15వ తేదీన ప్రారంభించింది. బలమైన చలిగాలులు వీస్తున్నా.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. లక్ష్యంవైపు కదులుతూ ముందుకు సాగింది.‘ఒకానొక సమయంలో శిఖరాగ్రానికి చేరుకునేందుకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వెనక్కు వెళ్లిపోదామా అని కామ్యను అడిగాను. ఎముకలు కొరికే చలిలో ఇంకా ముందుకెళ్తే.. మరింత ప్రమాదకరం. ఒక్కసారి ఆలోచించు. అని చెప్పాను. అయినా.. తను వినలేదని’చెబుతున్నారు లావణ్య. తల్లిదండ్రులనడుమశిఖారాగ్రానచిన్నారికామ్య ‘నిజమే.. ఆ సమయంలో నేను కాస్తా భయపడ్డాను. అయినా.. పక్కనే.. కొండంత ధైర్యంగా అమ్మ ఉంటున్నప్పుడు.. నేనెందుకు భయపడాలని అనుకున్నాను. అమ్మ అలా అనేసరికి కాస్తా బెరుకుగా అనిపించినా.. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నాను. అమ్మా... ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహిస్తున్నప్పుడు.. చలి ప్రధాన శత్రువు. దాన్ని అధిగమిస్తే.. శిఖరం చేరుకోగలమని చెప్పావు కదా.. ఇప్పుడూ.. అవే మాటలు గుర్తు చేసుకుంటున్నానని అమ్మకు చెప్పాను. సరేనంటూ అమ్మ భుజం తట్టగానే.. ముందుకు కదిలామని’ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది చిన్నారి కామ్య. ఎట్టకేలకు పట్టువదలకుండా.. 23వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు మౌంట్ కోసియాజ్కోని అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా కామ్యా కార్తికేయన్ చరిత్ర సృష్టిస్తూ.. మువ్వన్నెల జెండాను ఎగురేసింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. కోసియాజ్కోను అధిరోహించడంతో మూడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది. మూడేళ్ల ప్రాయంలో నేషనల్ ట్రెక్ సక్సెస్ తల్లి శిక్షణలో క్రమంగా నడక, ట్రెక్కింగ్ అలవర్చుకున్న కామ్య కార్తికేయన్.. విశాఖలోని డాల్ఫిన్ హిల్స్, మురళీనగర్‌లోని కొండలు, కంబాలకొండ, ఏజెన్సీలోని ట్రెక్కింగ్‌కు అనువైన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించింది. లావణ్య ముందు ట్రెక్ చేస్తుంటే.. కామ్య కూడా అమ్మ వెనుకాలే.. ఒక్కో అడుగు పైకెయ్యసాగింది. కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబైలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని సాహసయాత్రికులందరినీ అబ్బురపరిచింది. తొలి నేషనల్ ట్రెక్ సక్సెస్ అవ్వడంతో లావణ్య ఆనందం అంబరాన్ని తాకింది. ఆ తర్వాత మరింతగా ట్రైనింగ్ ఇస్తూ పూర్తి స్థాయి ట్రెక్కర్‌గా మార్చింది. అంతే కామ్య సాహసయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. పెద్దలే ఇబ్బందులు పడే సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ 2014లో నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అదే ఏడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గడ్ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతో పాటు ఎక్కి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్లకేహిమాలయమంత ఎత్తుకు.. ♦ ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు తల్లితో పాటు కామ్య సిద్ధమైంది. తల్లీ కూతుళ్లిద్దరూ మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేశారు. ♦ 2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్కిదమ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ♦ ఆ తరువాత కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించారు. కామ్య 9 సంవత్సరాల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు సరస్సుని అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు అర్హత సాధించి అవలీలగా ఆ శిఖరాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. అమ్మదే క్రెడిట్..కాదు..కామ్యదే కష్టం పర్వతారోహణలో వరుస రికార్డులు సృష్టిస్తున్న కామ్యని.. ప్రతి శిఖరం ఎక్కాక నువ్వెలా ఫీలవుతావని అడిగితే...‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మే నాకు అన్నీ. తను ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. ఈ ఏడాది డిసెంబర్లో దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరమైన అకొన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇది ఏడు ఖండాల్లో ఉన్న రెండో అతి పెద్ద శిఖరం. అమ్మ తోడుంటే.. 2021 నాటికి ఏడు పర్వత శ్రేణులు ఎక్కేస్తా. నా ప్రతి విజయంలోనూ అమ్మకే మొత్తం క్రెడిట్’అంటూ కామ్య కార్తికేయన్ గారాలు పోయింది. కామ్య విజయాల గురించి మీరెలా ఫీలవుతున్నారని తల్లి, గురువు లావణ్యను అడిగితే.. ‘ఇందులో.. నా గొప్పేం లేదు.. అంతా మా ముద్దుల తల్లి అకుంఠిత దీక్షతోనే సాధ్యమయ్యాయి. కామ్య పట్టుదల ఉన్న అమ్మాయి. ఇప్పటి వరకూ మూడు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. మిగిలిన నాలుగు శిఖరాల్ని అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. తన లక్ష్యాల్ని ఒక్కొక్కటిగా అధిరోహిస్తోంది. ఎంతటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో.. కామ్యను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నాం. కామ్య తన టార్గెట్‌ను కచ్చితంగా పూర్తి చేస్తుందనే విశ్వాసం మాలో ఉంది.’అని.. కుమార్తె గొప్పదనం గురించి చెబుతూ.. మురిసిపోయింది లావణ్య కార్తికేయన్. సొంతమైన రికార్డులు ♦ సాహసమే ఊపిరిగా సాగిపోతూ.. శిఖరాలు చిన్నబోయేలా అడుగులు వేస్తూ.. అందనంత ఎత్తుకు ఎదుగుతున్న కామ్య కార్తికేయన్ 2017లో మూడు రికార్డులు సృష్టించింది. ♦ 6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతి పిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది. ♦ 2017 మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. ♦ అదే ఏడాది ఆగస్టులో లెహ్‌లో 20,187 అడుగుల ఎత్తయిన స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి.. ఇన్ని అడుగులు శిఖరం అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ఈ పర్వతాన్ని అధిరోహించినప్పటికి కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే. ♦ అదే ఏడాది అక్టోబర్ 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్‌తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఆసియా ఖండంలోని రెండో బాలికగా రికార్డు సృష్టించింది. ♦ 2018 జూన్‌లో రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. -
శిఖరాగ్రాన చిన్నారి
విశాఖ సిటీ: నడక నేర్చుకున్నప్పటి నుంచే కొండలెక్కడం అలవాటు చేసుకుంది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్టు.. పదేళ్లకే కిలిమంజారో శిఖరాన్ని అలవోకగా అధిరోహించి రికార్డులను ఒడిసి పట్టుకుంది. సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం చిన్నబోతాయని నిరూపిస్తోంది.. ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది విశాఖ నగరానికి చెందిన పదేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్. తల్లిదండ్రులే గురువులుగా పర్వతారోహణలో అంతర్జాతీయ ప్రతిభ కనబరుస్తోంది. కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్‌గా నేవీలో పలు ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది చిన్నారి కామ్య. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తల్లిదండ్రులతోపాటు ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆ అలవాటే ఆ బాలికకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. మూడేళ్ల ప్రాయంలోనే.. క్రమంగా నడక, ట్రెక్కింగ్ అలవర్చుకున్న కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబై సమీపంలోని లొనోవాలా ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. అంతేకాదు.. ►సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు జమ్మూకాశ్మీర్‌లోని గుల్మార్గ్ దర్శనీయ స్థలానికి నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ►మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్‌గఢ్ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతోపాటు ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ►ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేసింది. ► ఆ తర్వాత 2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్కిదున్ని విజయవంతంగా పూర్తిచేసింది. కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించింది. ►9 ఏళ్ల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్ మంచు సరస్సును అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబీసీ)కు కామ్య అర్హత సాధించింది. ఏడాదిలో మూడు రికార్డులు కామ్య కార్తికేయన్ ఈ ఏడాది మూడు రికార్డులు సృష్టించింది. 6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతిపిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను పూర్తిచేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ నెల 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్‌తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా రికార్డు సృష్టించింది. జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ స్టాక్ కాంగ్రీ పర్వతారోహణల్ని విజయవంతంగా పూర్తిచేసిన కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే. చదువులోనూ శిఖరమే.. విశాఖ నేవీ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న కామ్య పర్వతారోహణలోనే కాదు.. చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆ బాలిక స్పెల్‌బీ కాంపిటేషన్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. వివిధ ఒలింపియాడ్లలో జిల్లా స్థాయి మెడల్స్ సాధించింది. సంగీతంలోనూ ప్రావీణ్యం పొంది పియానో వాయిద్యంలో 3 గ్రేడులు పాసైంది. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించిన ఈ చిన్నారి భరతనాట్యంలోనూ అదరగొడుతోంది. ఏడు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయం లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతిఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. – కామ్య కార్తికేయన్ -
టార్గెట్ ఎవరెస్ట్
► తొమ్మిదేళ్ల విశాఖ చిన్నారి అరుదైన ఘనత ► తల్లితో కలసి ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరుకున్న కామ్య కార్తికేయన్ సాక్షి, విశాఖపట్నం: సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం తలొంచాల్సిం దేనని తొమ్మిదేళ్ల చిన్నారి నిరూపించింది. విశాఖకు చెందిన కామ్య కార్తికేయన్ రోజుకు 9 గంటల పాటు నడిచి.. 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు(18,000 అడుగులు) చేరు కుంది. తద్వారా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో బాలికగా రికార్డు సృష్టించింది. బాలిక తండ్రి కార్తికేయన్ తూర్పు నావికాదళ అధికారి, తల్లి లావణ్య ఉపాధ్యాయురాలు. కామ్య కార్తికేయన్ ప్రస్తుతం నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ఆరో తరగతి చదువు తోంది. చిన్నప్పట్నుంచీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతా రోహణలో మెళకువలు నేర్చుకున్న కామ్య మూడేళ్ల వయసులోనే సహ్యాద్రి కొండలు ఎక్కేసింది. 2015లో ఒకసా రి, 2016లో 3సార్లు హిమాలయాల్లో భాగమైన చంద్రశిల (13 వేల అడుగు లు), హర్కిధమ్ (13,500 అడుగులు), రూప్ ఖండ్ లేక్ (16,499 అడుగులు)ను అధిరోహిం చింది. ఇప్పుడు ఏకంగా ఎవ రెస్ట్ బేస్ క్యాంప్‌పై త్రివర ్ణ పతాకాన్ని ఎగురవేసింది. దేశంలో ఇంత చిన్న వయ సులో ఎవరూ ఈ ఘనతను సాధించలేదు. దీంతో జాతీ య రికార్డు కూడా కామ్య సొంతమైంది. సవాళ్లు ఎదుర్కోవడం నేర్పాలి కామ్య తల్లి లావణ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ‘మా ప్రయాణం నేపాల్‌లోని లుక్లా నుంచి ప్రారంభమైంది. రోజుకు 9 గంటలు నడవాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు సవాళ్లను ఎదుర్కోవడం చిన్నప్పట్నుంచే నేర్పాలనే ఉద్దేశంతో కష్టమైనా తనకి నచ్చిన మార్గంలో ప్రోత్స హిస్తున్నాం..’ అని చెప్పారు. నా తండ్రి కలను సాధిస్తా.. కామ్య మాట్లాడుతూ.. ‘ఎవరెస్ట్ ఎక్కాలనేది నా తండ్రి కల. దానిని నేను సాధించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు 18వేల అడుగులకు చేరుకున్నా ను. ఇకపై ఎక్కాలంటే దానికి ప్రత్యేక శిక్షణ అవసరం. 14 ఏళ్లు పూర్తయితేనే ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతిస్తారు. అర్హత సాధించగానే ఎవరెస్ట్‌పై కాలుపెడతాను..’ అని పేర్కొంది.