హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ రెండు వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలు తెలియజేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు తెలియజేశారు.
ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మే 1 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం రూ.600 మీ సేవా ద్వారా, ఏపీ ఆన్ లైన్ ద్వారా కూడా చెల్లించే వెసులుబాటు ఉంది. కాగా, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో జనరల్ విభాగాల్లో 72 మందిపై, ఒకేషనల్ విభాగంలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4శాతం ఉత్తీర్ణత పెరిగింది.