
ఆర్పీ పేట కేంద్రం నుంచి పరీక్ష రాసి బయటకు వస్తున్న పదో తరగతి విద్యార్థులు
ఆరిలోవ(విశాఖతూర్పు): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. గత నెల 18న ప్రారంభమైన పరీక్షలు 17రోజుల పాటు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండో తేదీకే ముగియాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ను బుధవారం నిర్వహించడంతో మూడో తేదీతో ముగి శాయి. జిల్లావ్యాప్తంగా 242 పరీక్ష కేంద్రాల్లో 56,683 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో బాలురు 28,953 మంది కాగా 27,730 మంది బాలికలున్నారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పరీ క్షలు ప్రశాంతంగా ముగిశాయి. 13 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 242మంది చీఫ్ ఎగ్జామినర్లు, 242మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.
అన్నీ ప్రభుత్వ కేంద్రాలే..
ఈ సారి పదో తరగతి పరీక్షలను నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన కొయ్యూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, క్రిస్టియన్ అరకు ఆదర్శ పాఠశాల, అనంతగిరి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, పాడేరులోని ఏపీ గిరిజన విద్యార్థుల సంక్షేమ పాఠశాల, చింతపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెదబయలులోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలపై ప్రత్యేక నిఘాపెట్టారు. 144 సెక్షన్ అమలు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ యాజమాన్యాలకు సహకారం?: టెన్త్ పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల పెత్త నం సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈవో కార్యాలయంలో కొందరు అధికారులు ప్రైవేట్ యాజ మాన్యాలకు సహకరించారనే విమర్శలున్నాయి. వారి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇన్విజిలేటర్ల ద్వారా బిట్, చిన్న ప్రశ్నలకు జవాబులు అందించడంలో సహకారం అందించినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment