
బల్లికురవ: తల్లి చినపోయినా ఆ బాధను మనసుసులోనే దిగమింగుకుని, మనోధైర్యంతో బల్లికురవ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షలకు హాజరవుతోంది. మండలంలోని చిన అంబడిపూడి గ్రామానికి చెందిన కోవూరి వెంకటశేషయ్య, కుమార్తె సరళను 18 సంవత్సరాల క్రితం మార్టూరు మండలం, చిమ్మరిబండకు చెందిన పల్లపు వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఆరు సవత్సరాల క్రితం సరళ అనారోగ్యం బారిన పడటంతో, నీవు నాకు అక్కర్లేదని, వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురిచేయడంతో సరళ పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది.
కుమార్తె ప్రియాంక స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సరళ అనారోగ్యంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్న ఈ నెల 12న మరణించింది. ప్రియాంక తల్లి అంత్యక్రియలకు హాజరై తిరగి పాఠశాలకు వచ్చి, తాత, వెంకటశేషయ్య, విద్యాలయం ప్రత్యేకాధికారి సరళ కుమారి ఇచ్చిన ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తోంది. తన తల్లి చనిపోయింది. తండ్రి వెంకటేశ్వర్లు పట్టించుకోవడం లేదు. దాతలు సహకారం అందిస్తే తాను, తన సోదరుడు అనిల్ ఉన్నత చదువులు చదువుకోగలమని విద్యార్థిని చెప్పింది.