
మార్చి 21 నుంచే పదో తరగతి పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించేందుకు రూపొందించిన టైంటేబుల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది.
- ఎగ్జామ్స్ టైంటేబుల్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం
- నేడు అధికారికంగా షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించేందుకు రూపొందించిన టైంటేబుల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. దీంతో ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం టైంటేబుల్‌ను జారీ చేసేందు కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కోసం మంగళవారం సాయంత్రం సంప్రదించగా పరీక్షలకు
ఎన్నికల కోడ్ అడ్డంకి కాబోదని కమిషన్ మౌఖికంగా పేర్కొంది.
ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇదీ ఒక పేపరే ఉంటుంది. మిగితా సబ్జెక్టులు రెండు చొప్పున పేపర్లు ఉంటాయి. మార్చి 23న హోలీ, 25న గుడ్ ఫ్రైడే, 27నఆదివారం, ఏప్రిల్ 3న ఆదివారం, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 8న ఉగాది కావడంతో ఆయా తేదీలను విద్యాశాఖ తొలగించి టైంటేబుల్ రూపొందించింది.
ఇదీ పరీక్షల షెడ్యూలు
21-3-2016 - ప్రథమ భాష పేపరు-1
22-3-2016 - ప్రథమ భాష పేపరు-2
24-3-2016 - ద్వితీయ భాష
26-3-2016 - ఇంగ్లిషు పేపరు-1
28-3-2016 - ఇంగ్లిషు పేపరు-2
29-3-2016 - గణితం పేపరు-1
30-3-2016 - గణితం పేపరు-2
31-3-2016 - జనరల్ సైన్స్ పేపరు-1
1-4-2016 - జనరల్ సైన్స్ పేపరు-2
2-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-1
4-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-2
6-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-1
7-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-2
9-4-2016 - ఎస్సెస్సీ వొకేషనల్ (థియరీ)