చిట్టచివరి పరీక్ష రోజు.. బాలిక మృతి | girl dies in accident while going to write last examination | Sakshi
Sakshi News home page

చిట్టచివరి పరీక్ష రోజు.. బాలిక మృతి

Published Tue, Apr 15 2014 11:25 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

girl dies in accident while going to write last examination

పదో తరగతి పరీక్షలలో చిట్టచివరి పరీక్ష మంగళవారం జరుగుతోంది. సోషల్ రెండో పేపర్ రాసేస్తే ఇక పరీక్షలు అయిపోతాయి. మరో రెండు నెలల్లో కాలేజీకి వెళ్లిపోవచ్చని ఆ చిన్నారి అనుకుంది. అంతలోనే కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆమె ప్రాణాలు బలిగొంది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టుపూడివలస వద్ద సంభవించింది.

పదోతరగతి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న ఓ విద్యార్థినిని కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే పోలీసులు మాత్రం కారును వదిలేశారంటూ పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలం వద్దకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు తరిమికొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement