girl dies
-
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్‌నగర్‌టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్‌కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్‌నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్‌కు చెబితే పెయిన్‌బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్‌కు చెప్పారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
పుణ్య స్నానాలు చేస్తూ..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయప్రాంగ ణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గండి చెరువు వద్ద ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో మునిగి ఒక బాలిక మృతి చెందింది. స్థానికులు, మృ తురాలి కుటుంబ సభ్యులు తెలిపి న వివరాలివి. హైదరాబాద్‌లోని మల్కా పూర్‌కు చెందిన బొంతల రోజా (15) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం యాదాద్రీశుడి దర్శనానికి వచ్చింది. మధ్యాహ్నం లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేస్తుండగా రోజా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి రోజాను కాపాడే ప్రయత్నం చేశారు. భక్తులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ వచ్చేటప్పటికి బాలిక మృతి చెందింది. ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు భక్తులు, పోలీసులు భావిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీసులు మృతదేహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీశారు. ఆలయ సిబ్బంది పుష్కరిణిలో నీటిని తరలించి సంప్రోక్షణ చేశారు. -
ఊయలే ఉరితాడై..
పాణ్యం: ఊయలే ఉరితాడైంది..ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాణ్యం గ్రామానికి చెందిన అబిబా, మాబాషాలకు కుమారుడు, కుమార్తె సంతానం. రోజులాగే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమార్తె సునయన (13) చెట్టుకు ఊయల వేసుకొని ఆడుకుంటూ ఉంది. ఊయలలో కూర్చుని తాడును పురితిప్పగా అది తిరిగి అతి వేగంగా వ్యతిరేక దిశలో మెలితిరిగి.. ఒక్కసారిగా సునయన మెడకు బిగుసుకుంది. గమనించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందింది. సునయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. కేసు నమోదు చేసినట్లు పాణ్యం హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపారు. -
అమ్మమ్మను కాపాడబోయి యువతి మృతి
మరిపెడ రూరల్: విద్యుదాఘాతానికి గురైన అమ్మమ్మను కాపాడబోయి.. విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతారాంపురం కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...మండల కేంద్రంలోని ఎస్కే యహయా, షాహీన్ దంపతుల కుమార్తె ఎస్కే అరిఫా(22) సీతారంపురంలోని తన అమ్మమ్మ ప్యార్‌బీ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో వాషింగ్ మిషన్ స్వీచ్ ఆఫ్ చేస్తున్న క్రమంలో ప్యార్‌బీ విద్యుదాఘానికి గురైంది. ఇది గమనించిన అరిఫా అమ్మమ్మను కాపాడే ప్రయత్నంలో చేయి పట్టి లాగింది. దీంతో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ప్యార్‌బీ మాత్రం స్వల్ప గాయాలతో బయట పడింది. మృతురాలు మండల కేంద్రంలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబానికి పరామర్శ మృతురాలి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గుడిపుడి నవీన్, డోర్నకల్ నియోజక వర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మైనార్టీ సంఘం నాయకులు మక్సుద్, లతిఫ్, యూత్ నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనులు గురువారం పరామర్శించి సంతాప సానుభూతిని తెలిపారు. -
అయ్యో పాపం.. జ్ఞానేశ్వరి
కొల్చారం(నర్సాపూర్): పుట్టుకతోనే మాటలురాని ఆరేళ్ల చిన్నారి ఐదురోజుల క్రితం తప్పిపోయి శవమై కనిపించింది. అసలేం జరిగిందో తెలియదు కాని ఆ తల్లిదండ్రులకు తీరనిశోకమే మిగిలింది. కొల్చారం మండలం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలాల్లో ఆరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి శవం మంగళవారం లభ్యమైంది. మృతిచెందిన చిన్నారి మండలంలోని ఎనగండ్ల గ్రామానికి చెందిన ఏష బోయిన శ్రీశైలం కూతురు జ్ఞానేశ్వరి(6)గా గుర్తించారు. కొల్చారం ఎస్సై పెంటయ్య, చిన్నారి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొల్చారం మండలం సదాశివనగరానికి చెందిన కంచర్ల కిష్టయ్య పెద్దకూతురు మొగులమ్మ. మొదటి భర్త మరణించడంతో కూతురు మొగులమ్మను, మనవరాలు జ్ఞానేశ్వరిని పుట్టింటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత కూతురుకు ఎనగండ్ల గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం రెండో వివాహం చేశాడు. వారు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గత శుక్రవారం కూతురు జ్ఞానేశ్వరిని భర్త వద్ద వదిలి మొగులమ్మ కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మొగులమ్మ కూతురు ఏదంటూ భర్తను అడగడంతో ఇప్పుడే అన్నం తిని బయటకు వెళ్లినట్లు తెలిపాడన్నారు. రాత్రి 8 దాటినా కూతురు రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని అడిగినా సమాచారం లభించకపోవడంతో రంగంపేటలోని బంధువులకు విషయం తెలిపారు. ఐదు రోజులుగా జ్ఞానేశ్వరికోసం గాలించిన బంధువులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం రంగంపేట శివారులోని కొత్త చెరువు సమీప పొలంలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు రంగంపేట గ్రామసేవకుల ద్వారా సమాచారం రావడంతో జ్ఞానేశ్వరి బంధువులు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే శవం కుళ్లిపోగా శరీరంపై ఉన్న దుస్తులను చూసి జ్ఞానేశ్వరిగా గుర్తించారు. ఘటన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జ్ఞానేశ్వరి కాళ్లు, చేతులకు అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన చేపల వల చుట్టుకోవడం, నిర్మానుష్య ప్రదేశం కావడం, అరిచేందుకు మాటలు రాకపోవడం చిన్నారి మృతిచెందడానికి కారణమై ఉండవచ్చు అన్న అనుమానాలను ఎస్సై పెంటయ్య వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్లను రప్పించి పరిసరాలను క్షున్నంగా పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై పెంటయ్య కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. -
నోకియా ఫోను పేలి యువతి మృతి
జర్సుగుడ : ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న ఘటనలు ఇటీవల తరచు వింటూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే ఫోన్ మాట్లాడుతూ.. తీవ్ర ప్రమాద బారిన పడుతున్నారు. ఇదే మాదిరి ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 18 ఏళ్ల యువతి మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి, ఫోన్ మాట్లాడుతుండగా.. దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలామంది చేసే మాదిరిగానే ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే.. ఉమా తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఆ సెల్ ఫోన్ నోకియా 3110 మోడల్ అని తెలిసింది. భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో ఉమా మాట్లాడుతుందని, ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో, దానికి ఛార్జింగ్ పెట్టి మాట్లాడిందని ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఓరమ్ చెప్పాడు. గతేడాదే లాంచ్ అయిన నోకియా ఫోన్ వల్ల ఈ ఘటన జరగడంతో, ఈ మొబైల్ తయారీ కంపెనీ తగిన పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
డెంగీ లక్షణాలతో బాలిక మృతి
బొమ్మనహాళ్: ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
అప్పుడే నూరేళ్లు నిండాయి
వంట చేయబోయి బాలిక మృత్యువాత శరీరమంతా ఎగిసిన మంటలు శోకసంద్రంలో పాల్తూరు కష్టాన్నే నమ్ముకున్న ఆ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పాస్తులు పెద్దగా లేవు.. బతకడానికి ఏ ఆధారంలేదు..కష్టమే వారి జీవనాధారం..కూలి పనికి పోతేనే పూట గడుస్తుంది. మొదటి సంతానంగా మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అమ్మానాన్న పనులకెళ్లినా .. ఇంటి పట్టున చెల్లెల్లు, తమ్ముడికి అక్కలా.. అమ్మలా అన్నీ తానై మెలిగేది. ఆడుతూ పాడుతూ ఆ ఇంట తిరిగే ఆ ఇంటి వరలక్ష్మిని చూసి విధి ఓర్చుకోలేకపోయింది. అమ్మలా అన్నం చేస్తుండగా .. అగ్ని ప్రమాదం రూపంలో ఆయువు తీసుకుంది. కళ్లముందు కనకమహాలక్ష్మిగా గెంతులేయాల్సిన ఆచిట్టితల్లికి అప్పుడే వందేళ్లు నిండాయన్న విషయం తెలిసి ఆదంపతులు గుండెలవిసేలా విలపించారు. ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన కట్టతిప్పన్నగారి లక్ష్మీ, చెన్నయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. శుక్రవారం ఉదయమే చెన్నయ్య పొలానికెళ్లాడు. అన్నం చేసిన తర్వాత లక్ష్మీ కూడా భర్తకు పొలం పనుల్లో తోడుగా ఉండేందుకు బయల్దేరింది. వెళుతూ వెళుతూ ‘పప్పు’ చేసి పెట్టి వెళ్లమ్మా అంటూ ఏడో తరగతి చదివే పెద్ద కుమార్తె వరలక్ష్మి (13)కి చెప్పింది. సరే అని ఆ అమ్మాయి కట్టెల పొయ్యి వెలిగించి పప్పు చేసేందుకు ఉపక్రమించింది. మిగతా ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో గోడపై పోపు సామాన్లు తీసుకుంటుండగా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బా కిందకు పడింది. కొంత అమ్మాయి శరీరంపైకి, మరికొంత మండుతున్న పొయ్యిలోకి ఎగిసిపడింది. అంతే ఒక్క ఉదుటున అగ్నికీలలు వరలక్ష్మిని చుట్టుముట్టాయి. మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు పొలంలోంచి పరుగులు తీసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్న కుమార్తెను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. వరలక్ష్మి మృతితో పాల్తూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళీ తెలిపారు. -
సెల్ఫీ మోజులో పడి..
ముంబై: సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలు తీసింది. కాలేజీ విద్యార్థిని ప్రీతి శ్రీకృష్ణ భిసే (17) తన మిత్రులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం మెరైన్ డ్రైవ్ సముద్ర తీరానికి వచ్చింది. అప్పటికే సముద్రంలో హై టైడ్ కారణంగా పెద్ద పెద్ద అలలు వేగంగా ఒడ్డుకు వస్తున్నాయి. కాని, సముద్ర అలల మధ్య నిలబడి మిత్రులతో కలిసి సెల్ఫీ దిగాలని ప్రీతి భావించింది. అలా ప్రెండ్స్‌తో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఓ భారీ అల రావడంతో ప్రీతి అదుపుతప్పి నీటిలో పడి, కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో వెంటనే మెరైన్ డ్రైవ్ పోలీసులకు సమాచారం అందించారు. గంటలపాటు గాలింపు చర్యలు సాగాయి. చివరికి రాత్రి సమయంలో ప్రీతి మృతదేహం లభించింది. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. -
తమ్ముడితో ఆడుకుంటూ.. బాలిక మృతి
సరదాగా ఊటీ చూద్దామని కుటుంబంతో సహా వచ్చి, అక్కడ తన తమ్ముడితో ఆడుకుంటూ ఓ పాప తన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇక్కడి బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగింది. కర్ణాటకలోని చామరాజనగర్ నుంచి మొత్తం 12 మంది సభ్యులు గల బృందం ఊటీకి వచ్చింది. అందులో 12 ఏళ్ల బాలికతో పాటు 5 ఏళ్ల వయసున్న ఆమె తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్లిద్దరూ అక్కడ ఒక ఉయ్యాలలో ఆడుకుంటూ ఉండగా ఇద్దరూ అనుకోకుండా ఢీకొన్నారు. దాంతో ఆమె తల ఉయ్యాల ఉన్న ఇనుప రాడ్‌కు తగిలింది. ఫలితంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలిక తమ్ముడికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయని, అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. -
డెంగీతో బాలిక మృతి
బ్రహ్మసముద్రం : యరడికెర గ్రామానికి చెందిన సానియా (4) డెంగీతో గురువారం మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు జాఫర్, రమీజాబేగం తెలిపిన వివరాలు... నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో భాధపడుతూ అస్వస్థతకు గురైన బాలికను, చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం డెంగీ వ్యాధిగా నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు పాపను వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సానియా మృతి చెందింది. -
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
అనంతపురం టౌన్ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మతి చెందింది. ఇటుకలపల్లి ఎస్ఐ కరీం తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం నెట్టివారిపల్లికి నారాయణస్వామి, అమత దంపతులు తమ కుమార్తె ప్రభావతి (10)తో కలిసి అనంతపురం వచ్చారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రభావతి మతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణస్వామికి కాలు విరిగింది. -
యూనిఫాంలో దాగున్న పాము కాటేసి..
స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని.. స్కూలుకు వెళ్దామనుకుంది. ఎంచక్కా తనకు తానే స్కూలు యూనిఫాం తీసుకుని వేసుకుంది. కానీ కాసేపటికే ఎందుకో బాగా నొప్పిగా అనిపించింది. అంతలోనే నురగలు కక్కుతూ పడిపోయింది. గుజరాత్లో ఎనిమిదేళ్ల బాలిక.. స్కూలు యూనిఫాంలో దాగున్న పాము కాటేయడంతో మరణించింది. ఈ ఘటన పంచమల్ జిల్లా పరిధిలోని రింగానియా గ్రామంలో జరిగింది. అర్మితా బింఝ్వర్ అనే ఆ అమ్మాయి యూనిఫాం వేసుకున్న కొద్ది సేపటికే తనకు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి.. స్పృహతప్పి పడిపోయింది. దాంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు వెంటనే వెతగ్గా, కూతురి శరీరం మీద పాము కాటేసిన గుర్తు కనిపించింది. అమ్మాయి యూనిఫాంలో దాగున్న పాము.. ఆమె ఆ యూనిఫాం వేసుకోగానే కాటేసినట్లు వారికి అర్థమైంది. వాళ్లు వెంటనే అర్మితను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చినా.. ఒక గంటలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
కొడుమూరు: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొడుమూరుకు చెందిన కీర్తి (15) మృతి చెందగా, ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికు తరలించారు. తండ్రితో కలసి ఇద్దరు బాలికలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మినగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో బాలిక మృతి
మహానంది(కర్నూలు): డెంగీతో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మలపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తేజస్విని(7) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది. -
డెంగితో బాలిక మృతి
హైదరాబాద్: పాతబస్తీపై డెంగీ పంజా విసురుతుంది. రెండు రోజుల క్రితం నిండు గర్భిణీ మృతి చెందిన వార్త మరువక ముందే మరో చిన్నారీని డెంగీ బలి తీసుకుంది. జంగమ్మెట్కు చెందిన ఆరేళ్ల బాలిక ఆదివారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.....జంగమ్మెట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన శేఖర్ గౌడ్, వనజ దంపతుల పెద్ద కుమార్తె అక్షయ (6) ఖాద్రీ చమాన్ ప్రాంతంలోని సెయింట్ ఫీటర్ పాఠశాలలో ఒకటో తరగతి విద్యనభ్యసిస్తుంది. ఐదు రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో బాధ పడుతుండడంతో శేఖర్ స్థానికంగా ఉన్న ఆసుపత్రులలో చికిత్స చేయించాడు. అయినప్పటికీ జ్వరం నయం కాకపోవడంతో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకె ళ్లాడు. మొదట టైపాయిడ్, మలేరియా అంటూ చెప్పుకొచ్చిన వైద్యులు చేతులెత్తేయడంతో చివరకు మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని నైస్ ఆసుపత్రికి శనివారం తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన అక్షయ ఆదివారం రాత్రి మృతి చెందింది. డెంగీ కారణంగానే అక్షయ మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు మరణ దృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. కాగా బాలిక తండ్రి శేఖర్ పండ్ల అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు. -
డెంగీతో విద్యార్థిని మృతి
టి. నర్సాపురం: డెంగీ వ్యాధితో విద్యార్థి మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు. గ్రామానికి చెందిన రమాదేవి (16) స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందని.. ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. -
స్వైన్‌ఫ్లూతో పదేళ్ల బాలిక మృతి
చందుర్తి: కరీంనగర్ జిల్లాకు చెందిన పదేళ్ల బాలిక స్వైన్‌ఫ్లూ కారణంగా ఆదివారం మృతి చెందింది. వివరాలు.. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన చింతకుంట శుక్లాచారి, రేణుక దంపతుల కుమార్తె శృతి(10) రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. ఆమెను తీసుకుని కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకునేందుకు శనివారం కొమరవెల్లి దేవస్థానానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం శృతికి వాంతులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత డాక్టర్‌కు చూపిద్దామనుకున్న తల్లిదండ్రులు రాత్రికి కొమరవెల్లిలోనే ఉండిపోయారు. ఆదివారం శృతికి సీరియస్‌గా ఉండడంతో తొలుత సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను చేర్చుకునేందుకు అక్కడ నిరాకరించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించేలోపే శృతి మరణించింది. శృతి వ్యాధి లక్షణాలు స్వైన్‌ఫ్లూ వైరస్‌ను పోలి ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. -
చిట్టచివరి పరీక్ష రోజు.. బాలిక మృతి
పదో తరగతి పరీక్షలలో చిట్టచివరి పరీక్ష మంగళవారం జరుగుతోంది. సోషల్ రెండో పేపర్ రాసేస్తే ఇక పరీక్షలు అయిపోతాయి. మరో రెండు నెలల్లో కాలేజీకి వెళ్లిపోవచ్చని ఆ చిన్నారి అనుకుంది. అంతలోనే కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆమె ప్రాణాలు బలిగొంది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టుపూడివలస వద్ద సంభవించింది. పదోతరగతి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న ఓ విద్యార్థినిని కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే పోలీసులు మాత్రం కారును వదిలేశారంటూ పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలం వద్దకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు తరిమికొట్టారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రేవతి మరణించింది. కాకినాడలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న రేవతి, సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. మూడు రోజుల్లో పెళ్లి ఉందనగా ఓ యువతిపై ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన నవీన్ అనే యువకుడు ఈనెల 18వ తేదీన ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పిఠాపురానికి చెందిన రేవతి పదో తరగతి చదువుతోంది. గతంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ నవీన్ అనే పెయింటర్ వెంటపడేవాడు. ఆమె అతడిని తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో కూడా చెప్పడంతో ఇంట్లో పెద్దలు అతడిని తీవ్రంగా మందలించారు. కొంతకాలంగా దూరంగానే ఉంటున్న అతడు, బుధవారం ఉన్నట్టుండి రెచ్చిపోయాడు. ఇంట్లో అందరూ పెళ్లి పనుల మీద బయటకు వెళ్లిన సమయం చూసి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. కాసేపటికే ఇంట్లోంచి అమ్మాయి అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి ఆమె మంటల్లో కాలిపోతోంది. వెంటనే నీళ్లు పోసి, దుప్పట్లు కప్పి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ 60 శాతం వరకు ఆమెకు కాలిన గాయాలు కావడంతో వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ నిరాకరించిందని.. తగలబెట్టి చంపేసిన దుర్మార్గుడు!
ఖమ్మం : మృగాడి దారుణానికి ఓ బాలిక మృత్యువుతో పోరాడి తానువు చాలించింది. ఖమ్మం జిల్లా గార్ల మండలం తిర్లాపురానికి చెందిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.30 గంటలకు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.... ప్రభుత్వ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల కిరణ్మయిని అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి బాబురావు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అతనిని చాలాసార్లు హెచ్చరించారు. దసరా సెలవులకు ఇంటికొచ్చిన కిరణ్మయిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వచ్చి తన ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చాడు. కిరణ్మయి ససేమిరా అనడంతో ఈ నెల 18న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. బాలిక కేకలు విన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాలిన శరీరంతో పది రోజులు నరకయాతన అనుభవించిన కిరణ్మయి సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. నిందితుడు బాబురావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అంతకు ముందు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక మృతితో అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వరంగల్ యాసిడ్ దాడి నిందితులకు విధించిన 'తక్షణ శిక్ష' లాంటివే అన్నిచోట్లా అమలుచేయాలని, అప్పుడే అమ్మాయిలకు ఈ సమాజంలో రక్షణ లభిస్తుందని బాలిక తండ్రి వాపోయారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి సంఘటననే చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకుని మృతి చెందింది. దాంతో తల్లిదండ్రులు ఆ బాలికను ఖననం చేశారు. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు జరుపుతున్నారు. -
బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన రాక్షసుడు