అమ్మమ్మను కాపాడబోయి యువతి మృతి | Young Girl Dies With Electric Shock Warangal | Sakshi
Sakshi News home page

అమ్మమ్మను కాపాడబోయి యువతి మృతి

Published Fri, Nov 30 2018 8:03 AM | Last Updated on Mon, Dec 24 2018 12:35 PM

Young Girl Dies With Electric Shock Warangal - Sakshi

అరిఫా (ఫైల్‌) 

మరిపెడ రూరల్‌: విద్యుదాఘాతానికి గురైన అమ్మమ్మను కాపాడబోయి.. విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతారాంపురం కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...మండల కేంద్రంలోని ఎస్‌కే యహయా, షాహీన్‌ దంపతుల కుమార్తె ఎస్‌కే అరిఫా(22) సీతారంపురంలోని తన అమ్మమ్మ ప్యార్‌బీ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో వాషింగ్‌ మిషన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేస్తున్న క్రమంలో ప్యార్‌బీ విద్యుదాఘానికి గురైంది.

ఇది గమనించిన అరిఫా అమ్మమ్మను కాపాడే ప్రయత్నంలో  చేయి పట్టి లాగింది. దీంతో ఆమె కూడా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ప్యార్‌బీ  మాత్రం స్వల్ప గాయాలతో బయట పడింది. మృతురాలు మండల కేంద్రంలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి కుటుంబానికి పరామర్శ
మృతురాలి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌ గుడిపుడి నవీన్, డోర్నకల్‌ నియోజక వర్గ టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు డీఎస్‌ రవిచంద్ర, ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కుడితి మహేందర్‌రెడ్డి, మైనార్టీ సంఘం నాయకులు మక్సుద్, లతిఫ్, యూత్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనులు గురువారం పరామర్శించి సంతాప సానుభూతిని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement