current shack
-
షాక్ కొట్టిన కంచె! యువకుడికి..
కరీంనగర్: అటవీ జంతువుల నుంచి పంటను కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె షాక్కొట్టి ఓ యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి తన పంటచేల్లోకి వెళ్తుండగా మార్గమధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్కంచె షాక్‌తగిలి కాలు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు యువకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పంటల రక్షణ పేరిట రామన్నపేట, తిమ్మాపూర్ గ్రామాపరిధిలో వేటగాళ్లు కొందరు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసిన వన్యప్రాణులను వధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణల వేటగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి చదవండి: ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే -
పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: దీపావళి రోజున విషాదం నెలకొంది. మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. పెంబి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఈర్ల పోసాని–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈర్ల రంజిత్ (23) దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండునెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. గ్రామ సమీపంలో తన తండ్రికి ఉన్న మొక్కజొన్న పంటకు నీళ్లు పట్టేందుకు ఆదివారం ఉదయం 6 గంటలకు వెళ్లాడు. ఉదయం 10 గంటల అవుతున్నా ఇంటికి రాలేదు. తండ్రి అక్కడికి వెళ్లి చూడగా.. విద్యుత్ మోటర్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. పెళ్లిపీటలపై ఎక్కాల్సిన కొడుకు కానరానిలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజినీకాంత్ తెలిపారు. -
అమ్మమ్మను కాపాడబోయి యువతి మృతి
మరిపెడ రూరల్: విద్యుదాఘాతానికి గురైన అమ్మమ్మను కాపాడబోయి.. విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతారాంపురం కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...మండల కేంద్రంలోని ఎస్కే యహయా, షాహీన్ దంపతుల కుమార్తె ఎస్కే అరిఫా(22) సీతారంపురంలోని తన అమ్మమ్మ ప్యార్‌బీ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో వాషింగ్ మిషన్ స్వీచ్ ఆఫ్ చేస్తున్న క్రమంలో ప్యార్‌బీ విద్యుదాఘానికి గురైంది. ఇది గమనించిన అరిఫా అమ్మమ్మను కాపాడే ప్రయత్నంలో చేయి పట్టి లాగింది. దీంతో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ప్యార్‌బీ మాత్రం స్వల్ప గాయాలతో బయట పడింది. మృతురాలు మండల కేంద్రంలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబానికి పరామర్శ మృతురాలి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గుడిపుడి నవీన్, డోర్నకల్ నియోజక వర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మైనార్టీ సంఘం నాయకులు మక్సుద్, లతిఫ్, యూత్ నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనులు గురువారం పరామర్శించి సంతాప సానుభూతిని తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురకు గాయాలు
గణేశ్ మండపానికి విద్యుత్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం ఇల్లంతకుంట : గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభం కాక ముందే అపశతి చోటు చేసుకుంది. గణేశ్ మండపానికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఇద్దరు బాలురు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట ఇందిరమ్మ కాలనీ సమీపంలో కాలనీకి చెందిన విద్యార్థుల వినాయకుడిని ప్రతిష్టించేందుకు మండపం ఏర్పాటు చేశారు. అందులో విద్యుత్ ఏర్పాటు కోసం వైర్లను హైటెన్షన్ వైర్లకు తగిలించారు. మండపంలో సౌండ్ బాక్స్‌లకు కనెక్షన్ ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సారంగి మహేష్(13) తీవ్రంగా, దమ్మని అరవింద్(12) స్వల్పంగా గాయపడ్డారు. మహేష్‌పై విద్యుత్ తీగలు పడి మంటలు అంటుకోవడంతో ఓ ఆటో డ్రై వర్ గమనించి హైటెన్షన్ వైర్లకు తగిలించిన వైర్లను తొలగించాడు. స్థానికులు వెంటనే బాధితులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. -
విద్యుదాఘాతానికి గురైన రైతు మృతి
భీమదేవరపల్లి: విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నెల రోజుల క్రితం విద్యుదాఘాతానికి గురైన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తకొండకు చెందిన జుర్రు వెంకటాద్రి(50) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి వేశాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సక్రమంగా ప్రసారం కాకపోవడంతో తన వ్యవసాయ మోటర్ పనిచేయలేదు. గత నెల 30న అదే గ్రామానికి చెందిన ఓ రైతు సహాయంతో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి ఫీజు వైర్ సరిచేస్తుండగా అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరా అయింది. దీంతో వెంకటాద్రి షాక్‌కు గురయ్యాడు. పైనుంచి సమీపంలోని ఎర్త్ వైర్ రాడ్డుపై పడ్డాడు. దీంతో నడుము భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడికి భార్య వనమాల, కుమారుడు అనిల్, కూతురు అనూష ఉన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో రూరల్ ఏఈ రాకేశ్‌ను వివరణ కోరగా తమ అనుమతి లేకుండా రైతు ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా ప్రమాదం జరిగిందని, రైతు మృతి చెందాక తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. దీనిపై అధికారులకు విన్నవిస్తామని పేర్కొన్నారు. -
కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి
వీణవంక: మండలంలోని ఎల్బాకకు చెందిన ఎడెల్లి రాజశేఖర్‌రెడ్డి (28)అనే యువ రైతు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. రాజశేఖర్‌రెడ్డి తన రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. రెండ్రోజుల క్రితం ఎల్ఎండీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఎల్బాక గ్రామానికి డీబీఎం–6 కెనాల్‌కు నీళ్లు చేరాయి. పంటను కాపాడుకోవడానికి రాజశేఖర్‌రెడి సోమవారం రాత్రి కెనాల్‌కు బిగించిన మోటర్‌ను సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తండ్రి బంధువులకు సమాచారం ఇవ్వడంతో 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు, కూతురు ఉన్నారు.