- గణేశ్ మండపానికి విద్యుత్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం
- ఒకరి పరిస్థితి విషమం
విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురకు గాయాలు
Published Sat, Sep 3 2016 7:50 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
ఇల్లంతకుంట : గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభం కాక ముందే అపశతి చోటు చేసుకుంది. గణేశ్ మండపానికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఇద్దరు బాలురు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట ఇందిరమ్మ కాలనీ సమీపంలో కాలనీకి చెందిన విద్యార్థుల వినాయకుడిని ప్రతిష్టించేందుకు మండపం ఏర్పాటు చేశారు. అందులో విద్యుత్ ఏర్పాటు కోసం వైర్లను హైటెన్షన్ వైర్లకు తగిలించారు. మండపంలో సౌండ్ బాక్స్‌లకు కనెక్షన్ ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సారంగి మహేష్(13) తీవ్రంగా, దమ్మని అరవింద్(12) స్వల్పంగా గాయపడ్డారు. మహేష్‌పై విద్యుత్ తీగలు పడి మంటలు అంటుకోవడంతో ఓ ఆటో డ్రై వర్ గమనించి హైటెన్షన్ వైర్లకు తగిలించిన వైర్లను తొలగించాడు. స్థానికులు వెంటనే బాధితులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
Advertisement