చందుర్తి: కరీంనగర్ జిల్లాకు చెందిన పదేళ్ల బాలిక స్వైన్‌ఫ్లూ కారణంగా ఆదివారం మృతి చెందింది. వివరాలు.. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన చింతకుంట శుక్లాచారి, రేణుక దంపతుల కుమార్తె శృతి(10) రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. ఆమెను తీసుకుని కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకునేందుకు శనివారం కొమరవెల్లి దేవస్థానానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం శృతికి వాంతులు కూడా ప్రారంభమయ్యాయి.
ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత డాక్టర్‌కు చూపిద్దామనుకున్న తల్లిదండ్రులు రాత్రికి కొమరవెల్లిలోనే ఉండిపోయారు. ఆదివారం శృతికి సీరియస్‌గా ఉండడంతో తొలుత సిద్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను చేర్చుకునేందుకు అక్కడ నిరాకరించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించేలోపే శృతి మరణించింది. శృతి వ్యాధి లక్షణాలు స్వైన్‌ఫ్లూ వైరస్‌ను పోలి ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.
స్వైన్‌ఫ్లూతో పదేళ్ల బాలిక మృతి
Published Sun, Feb 8 2015 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement